Maruti Suzuki Swift: ఈ రూ.7 లక్షల కారు కోసం ఎగబడుతున్నారు.. ఆ కారు ఏదో తెలుసా?

దేశంలో కార్ల మారుతి కంపెనీ వివిధ వేరియంట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో స్విప్ట్ కారు ఎవర్ గ్రీన్ గా నిలుస్తోంది. 2005లో ప్రారంభమైన స్విప్ట్ అమ్మకాలు సాగుతూనే ఉన్నాయి.

Written By: Srinivas, Updated On : July 5, 2024 10:34 am

Maruti Suzuki Swift

Follow us on

Maruti Suzuki Swift: కార్ల సేల్స్ పెంచాలని చాలా కంపెనీలు వినియోగదారులకు తక్కువ ధరకే అందించాలని చూస్తున్నాయి. ఈ విషయంలో మారుతి ముందుంటుంది. అందుకే దశాబ్దాల కిందటే ఓ మోడల్ ను లోబడ్జెట్ లో తీసుకొచ్చి వినియోగదారులకు అందించింది. అయితే ఈ కారు ఆ తరువాత కాలంలో సేల్స్ ప్రభంజనం సృష్టిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇప్పటి వరకు ఆ మోడల్ విక్రయాలు జరుపుకుంటూనే ఉంది. ఇలా మొత్తంగా 30 లక్షల సేల్స్ మార్క్ దాటింది. అయితే ఈ మోడల్ కు సంబంధించి కొత్త వెర్షన్ మార్కెట్లోకి వచ్చి సందడి చేస్తోంది. అయినా పాత మోడల్ కు ఉన్న ఆదరణ తగ్గడం లేదు. ఇంతకీ ఆ కారు ఏదో తెలుసా?

దేశంలో కార్ల మారుతి కంపెనీ వివిధ వేరియంట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో స్విప్ట్ కారు ఎవర్ గ్రీన్ గా నిలుస్తోంది. 2005లో ప్రారంభమైన స్విప్ట్ అమ్మకాలు సాగుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు ఈ కారు 30 లక్షల వరకు విక్రయాలు జరుపుకుంది. హ్యాచ్ బ్యాక్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ కారు ఆ తరువాత వినియోదారుల మన్ననలను పొందింది. భారతీయ ఆటోమోటివ్ రంగంలో తనదంటూ ప్రత్యేకతను చాటుకున్న స్విప్ట్ ను అప్ గ్రేడ్ చేసి కొత్త మోడల్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

స్విప్ట్ 4వ తరం మోడల్ ను మే 9న మార్కెట్లోకి తీసుకొచ్చారు. పాత స్విప్ట్ నుంచి కొన్ని మార్పులు చేసి ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఈ కారు రూ.6.49 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పనిచేసే ఈ మోడల్ మెరుగైన మైలేజ్ తో పాటు భద్రతీ ఫీచర్లను అందుబాటులో ఉంచింది. నేటి వినియోగదారులు కార్లు కొనాలని చూస్తే స్విప్ట్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

స్విప్ట్ అమ్మకాలు పెరిగినప్పటికీ ధరలో మాత్రం తేడా ఉండడం లేదు. సాధారణ వినియోగదారులకు అందించాలనే ఉద్దేశంతో దీనిని రూ.7 లక్షలకు పైకి ధరను పెంచడం లేదు. దీంతో ఈ కారును ఎక్కువగా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండా అప్డేట్ చేసిన స్విప్ట్ సైతం అమ్మకాలు పెరుగుతున్నాయి.