Homeబిజినెస్Bike Mileage Tips: బండి మైలేజ్ కోసం సూపర్ 5 టిప్స్.. డబ్బులు బాగా సేవ్...

Bike Mileage Tips: బండి మైలేజ్ కోసం సూపర్ 5 టిప్స్.. డబ్బులు బాగా సేవ్ అవుతాయి..

Bike Mileage Tips: ప్రస్తుతం పెట్రోల్ ధరలు పెరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో కొత్తగా టూ వీలర్ కొనాలని అనుకునేవారు మైలేజ్ ఎక్కువగా ఇచ్చే వాహనాల వైపు చూస్తున్నారు. అయితే ఇప్పటికే వాహనాలు ఉన్నవారు వాటిని తీసేయకుండా కొన్ని టిప్స్ పాటిస్తే మైలేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. బైక్ లో ఉన్న చిన్న చిన్న లోపాలను సరిచేసుకుంటే అనుకున్న దానికంటే ఎక్కువ దూరం ప్రయాణం చేయవచ్చు. అందులో ప్రధానంగా ఈ 5 టిప్స్ పాటించడం వల్ల మీ డబ్బులు బాగా సేవ్ అవుతాయి. మరి ఆ 5 టిప్స్ ఏవో చూద్దాం..

1. టైర్ ప్రెషర్:
బైక్ మైలేజ్‌ బాగుండాలంటే టైర్ ప్రెషర్ చాలా ముఖ్యం. టైర్లలో గాలి తక్కువగా ఉంటే రోడ్డుతో టైర్ సంపర్కం ఎక్కువై రోలింగ్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. దీంతో బైక్‌ను ముందుకు తీసుకెళ్లడానికి ఇంజిన్ మరింత శక్తిని ఉపయోగించాల్సి వస్తుంది. ఫలితంగా పెట్రోల్ వినియోగం పెరిగి మైలేజ్ తగ్గుతుంది. అందువల్ల కనీసం వారానికి ఒకసారి లేదా సుదూర ప్రయాణానికి ముందు టైర్ ప్రెషర్ చెక్ చేసుకోవడం మంచిది.

2. క్రమం తప్పకుండా సర్వీసింగ్:
చాలా మంది బైక్ కొన్నకొత్తలో బాగానే చూసుకుంటారు. కానీ ఆ తరువాత సర్వీసింగ్ గురించి పట్టించుకోరు. కానీ బైక్‌ను ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించడం వల్ల ఇంజిన్ పనితీరు మెరుగ్గా ఉంటుంది. నిర్ణీత సమయంలో ఇంజిన్ ఆయిల్‌ను మార్చకపోవడం, ఎయిర్ ఫిల్టర్ మురికిగా ఉన్నా ఇంజిన్ సామర్థ్యం తగ్గవచ్చు కాబట్టి ఎయిర్ ఫిల్టర్, ఇంజిన్ ఆయిల్ క్రమం తప్పకుండా తనిఖీ చేయించాలి.

3. నిర్లక్ష్యంగా డ్రైవింగ్:
బైక్ నడిపే విధానం కూడా మైలేజ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. తరచుగా ఒక్కసారిగా వేగాన్ని పెంచడం, హఠాత్తుగా బ్రేకులు వేయడం వంటి అలవాట్లు ఇంధన వినియోగాన్ని పెంచుతాయి. ట్రాఫిక్‌లో అవసరం లేకుండా పదేపదే యాక్సిలరేటర్‌ను పెంచడం కూడా మైలేజ్ తగ్గడానికి కారణం కావచ్చు. సాధ్యమైనంత వరకు స్థిరమైన వేగంతో, స్మూత్‌గా బైక్ నడపడం మంచిది.

4. బైక్‌పై అనవసరమైన బరువు వద్దు:
బైక్‌పై ఎక్కువ బరువు ఉంటే మైలేజ్ తగ్గే అవకాశం ఉంది. ప్రతిరోజూ అవసరం లేని వస్తువులను బైక్‌లోని స్టోరేజ్ కంపార్ట్‌మెంట్ లేదా టాప్ బాక్స్‌లో కూడా ఉంచొద్దు. ఇలా చేయడం వల్ల ఇంధన వినియోగం పెరగవచ్చు. అందువల్ల ప్రయాణానికి అవసరమైన వస్తువులను మాత్రమే తీసుకెళ్లాలి.

5. నాణ్యమైన ఇంధన:
బైక్‌కు సరైన నాణ్యత కలిగిన ఇంధనం ఉపయోగించడం కూడా చాలా ముఖ్యం. నమ్మకమైన పెట్రోల్ బంకుల నుంచి ఇంధనం తీసుకోవడం మంచిది. ఎక్కువ ఆక్టేన్ ఇంధనం పోస్తే ప్రతి బైక్‌లోనూ మైలేజ్ పెరుగుతుందనే అపోహ ఉంది. వాస్తవానికి బైక్ ఇంజిన్‌కు అవసరమైన ఇంధన రకాన్ని మాన్యువల్‌లో సూచిస్తారు. కాబట్టి అవసరం లేని ఖరీదైన ఇంధనాన్ని ఉపయోగించొద్దు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Weight Loss

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
HYDRA Ranganath

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ కు రాం రాం.. తెలంగాణ హైకోర్టు సంచలనం

HYDRA Ranganath: హైడ్రా.. తెలంగాణలో 2023లో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అదించేందుకు ఏర్పాటు...
Kerala Innovation

Kerala Innovation: అమ్మ కష్టం చూడలేక.. ఈ కొడుకు చేసిన పని.. ఏకంగా సీఎం చప్పట్లు కొట్టాడు..

Kerala Innovation: ఉదయం లేవగానే ఇల్లు ఊడ్చి.. కల్లాపి చల్లాలి. ముగ్గు పెట్టాలి. బట్టలు ఉతకాలి. టీ దగ్గర నుంచి మొదలు పెడితే కూర వరకు వండాలి. ఇంటిని శుభ్రం చేయాలి. ఇన్ని...
Arunachalam Moksha Margam

Arunachalam Moksha Margam: అరుణాచలం మోక్షమార్గం.. తెలుగు భక్తులకే ఎందుకీ కష్టాలు..

Arunachalam Moksha Margam: అప్పుడెప్పుడో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అరుణాచలంలో ప్రదక్షిణలు చేయాలని.. మోక్ష మార్గం నుంచి బయటికి రావాలని పిలుపునిచ్చారు. ఆయన చెప్పడమే ఆలస్యం తెలుగు భక్తులు అప్పటినుంచి...
Suryakumar Yadav

Suryakumar Yadav: సూర్య కుమార్ యాదవ్.. నీ కష్టం పగ వాడికి కూడా రావద్దు బ్రో

Suryakumar Yadav:  అతడి నాయకత్వంలో టీమిండియా టి20 లలో ఒక్క ట్రోఫీ కూడా కోల్పోలేదు.. చివరికి టి20 వరల్డ్ కప్ కూడా సాధించింది. 2024లో రోహిత్ నాయకత్వంలో టీమిండియా అద్భుతం చేస్తే.. 2026లో...
Oktelugu Epaper