కేంద్రం బంపర్ ఆఫర్.. పేరు పెడితే లక్షల్లో పొందే ఛాన్స్..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. పేరు పెట్టడం ద్వారాసులభంగా లక్షల రూపాయలు పొందే అవకాశం కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పన కొరకు డెవలప్‌మెంట్‌ ఫైనాన్షియల్‌ ఇన్సిస్టి‍ట్యూషన్‌ కు తాజాగా ఆమోదం తెలిపింది. ఆర్హిక శాఖ ఇందుకు సంబంధించిన లోగో, లక్ష్యాలను స్పూరించే పేరు, తీరుతెన్నులను సూచించాలని పేర్కొంది. ఎవరైతే ఈ పోటీలో పాల్గొనడానికి ఆసక్తిని కలిగి ఉంటారో వాళ్లు ఆగష్టు 15వ తేదీ సాయంత్రం 5.30 గంటల […]

Written By: Navya, Updated On : July 28, 2021 5:15 pm
Follow us on


కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. పేరు పెట్టడం ద్వారాసులభంగా లక్షల రూపాయలు పొందే అవకాశం కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పన కొరకు డెవలప్‌మెంట్‌ ఫైనాన్షియల్‌ ఇన్సిస్టి‍ట్యూషన్‌ కు తాజాగా ఆమోదం తెలిపింది. ఆర్హిక శాఖ ఇందుకు సంబంధించిన లోగో, లక్ష్యాలను స్పూరించే పేరు, తీరుతెన్నులను సూచించాలని పేర్కొంది.

ఎవరైతే ఈ పోటీలో పాల్గొనడానికి ఆసక్తిని కలిగి ఉంటారో వాళ్లు ఆగష్టు 15వ తేదీ సాయంత్రం 5.30 గంటల లోపు తమ ఎంట్రీలను పంపాల్సి ఉంటుంది. ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా డెవలప్‌మెంట్‌ ఫైనాన్షియల్‌ ఇన్సిస్టి‍ట్యూషన్‌ పేరు ఉండటంతో పాటు లోగో, ట్యాగ్ లైన్ ఉండాలి. ఎవరైతే ఈ పోటీలో పాల్గొని విజేతగా నిలుస్తారో వారికి ఏకంగా 5 లక్షల రూపాయలు లభించే అవకాశం అయితే ఉంటుంది.

ఈ పోటీలో రెండో స్థానానికి ఎంపికైన వారికి 3 లక్షల రూపాయలు లభిస్తాయి. మూడో స్థానంలో నిలిచిన వాళ్లు 2 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. https://www.mygov.in/task/name-tagline-and-logo-contest-development-financial-institution వెబ్ సైట్ లింక్ కు పేరు, ట్యాగ్ లైన్, లోగోలకు సంబంధించిన డిజైన్లను పంపాల్సి ఉంటుంది. క్రియేటివిటీ ఉన్నవాళ్లకు ఈ పోటీలో పాల్గొనడం వల్ల ప్రయోజనం చేకూరనుంది.

పేరు పెట్టడం ద్వారా లక్షల్లో పొందే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తున్న నేపథ్యంలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఈ పోటీలో పాల్గొనడానికి ఆసక్తి చూపే అవకాశం అయితే ఉంటుంది.