సినీ రచయిత, దర్శకుడు పరుచూరి గోపాలకృష్ణ తన ‘పరుచూరి పలుకులు’లో దగ్గుబాటి కుటుంబ సభ్యుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. గోపాలకృష్ణ నారప్ప సినిమా చూడగానే.. ఆయనకు రామానాయుడు, సురేష్, వెంకటేశ్, రానా గుర్తొచ్చారని చెప్పుకుకొచ్చాడు. పనిలో పనిగా వాళ్ళ కుటుంబంలో అందర్నీ జ్ఞాపకం చేసుకున్నారు.
పరుచూరి మాటల్లోనే.. ‘మేము ఎన్టీఆర్ గారిని మా దైవంగా భావిస్తే, రామానాయుడు గారిని గాడ్ ఫాదర్‌గా భావిస్తాము. రామానాయుడుగారు నారప్ప సినిమాను చూసి ఉండి ఉంటే వెంకటేశ్ బాబు నటన చూసి చాలా సంతోష పడేవారు. రామానాయుడుగారికి బెస్ట్ జడ్జి. కథ వినగానే ఇది ఆడుతుందా లేదా అని చెప్పగలరు. కథ బాలేదు అంటే మనం సరిచేసి చెబితే ఇప్పుడు బానే ఉందని చెప్పే పెద్ద హృదయం కూడా ఉంది ఆయనకు.
రామానాయుడుగారు ‘ప్రతిధ్వని’ కథ విన్నది 7-8 నిమిషాలు అంతే.. కథ వినగానే సినిమా ఆడేస్తుందయ్యా అన్నారు. మొగుడ్ని పెళ్లాం.. లాఠీ పెట్టి కొట్టిందంటే.. ఎగబడి వస్తారు ఆడవాళ్లు. గొప్ప గొప్ప నిర్మాతలు సైతం ఇప్పుడు మౌనంగా కూర్చుకుంటున్నారే తప్ప, సినిమాలు తీయడం లేదు. బహుశా ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ వాళ్లకి నచ్చట్లేదు అనుకుంటా,
కానీ, గొప్ప నిర్మాతలలో రామానాయుడు ఉన్నంత కాలం సినిమాలు తీస్తూ ఉన్నారు. అయితే రామానాయుడి గారికి ఫ్లాప్స్ ఉన్నాయి. కానీ, సురేష్‌బాబుకి 90-95 శాతం వరకూ హిట్స్ ఉన్నాయి. కర్టెక్‌గా మనం చెబుతున్నప్పుడు.. ఇది కర్టెక్ కాదా అని సురేష్ బాబు కరెక్ట్ గా అంచనా వేయగలడు. ఇక వెంకటేశ్‌లో వివేకానందుడు ఉన్నాడు. వెంకటేశ్ అత్యంత అద్భుతమైన మనసు ఉన్నవాడు అంటూ పరుచూరి చెప్పుకొచ్చాడు.