https://oktelugu.com/

New Business : కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తున్నారా? అయితే ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి..

తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలంటే మాత్రం వ్యాపారమే సరైన మార్గం అని కొందరు అనుకుంటారు. ఒక్కరు లేదా కొంత మందితో కలిసి వ్యాపారం చేయాలని భావించే వారు ఉంటారు. అయితే వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి? ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? జీఎస్టీ కోసం ఎవరిని సంప్రదించాలి? అనే సందేహాలు ఉంటాయి. ఆ వివరాల్లోకి వెళితే.

Written By:
  • Srinivas
  • , Updated On : October 21, 2024 / 11:40 AM IST

    New Business

    Follow us on

    New Business :  జీవితంలో అధికంగా డబ్బు సంపాదించాలని ఎవరికైనా ఉంటుంది. కానీ అందరూ అనకున్న విధంగా ఆదాయం ఆర్జించలేరు. కొంత మంది ఉద్యోగాలు చేస్తూ ధనం కూడబెడుతారు. మరికొందరు వ్యాపారం చేయాలని అనుకుంటారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలంటే మాత్రం వ్యాపారమే సరైన మార్గం అని కొందరు అనుకుంటారు. ఒక్కరు లేదా కొంత మందితో కలిసి వ్యాపారం చేయాలని భావించే వారు ఉంటారు. అయితే వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి? ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? జీఎస్టీ కోసం ఎవరిని సంప్రదించాలి? అనే సందేహాలు ఉంటాయి. ఆ వివరాల్లోకి వెళితే..

    వ్యాపారం ప్రారంభించేముందు అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్, జీఎస్టీ నమోదు వంటి వివరాలు తప్పక తెలిసి ఉండాలి. ఎందుకంటే ప్రతి వ్యాపారానికి ఇవి తప్పనిసరి . అంతకంటే ముందు ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాలి. ముందుగా ఏ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారో నిపుణులు లేదా భాగస్వాములతో చర్చించుకోవాలి. ఉదాహరణకు ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే అందుకు అనుగుణంగా మీకు పూర్వానుభవం ఇందులో ఉందా? లేక భాగస్వాములతో కలిసి వ్యాపారం ప్రారంభిస్తే వారిలో ఒకరికైనా ఈ వ్యాపారం గురించి తెలుసా? అనే దానిపై చర్చించాలి. ఎందుకంటే ప్రారంభించే వ్యాపారంపై కాస్తైనా అవగాహన లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి.

    కొన్ని వ్యాపారాలకు లోకేషన్ తప్పనిసరి. లోకేషన్ బట్టే వీటికి వ్యాపారం ఉంటుంది. అందువల్ల ముందుగా ఈ విషయంపై దృష్టి పెట్టాలి. సరైన లోకేషన్ ను ముందుగా ఎంచుకున్న తరువాతే వ్యాపారం ప్రారంభానికి ముందడుగు వేయండి. ఇక్కడ మరో విషయం గుర్తుపెట్టుకోవాల్సిందేమిటంటే.. లోకేషన్ చుట్టుపక్కల ఇలంటి వ్యాపారాలే ఉన్నాయా? అనేది తెలుసుకోవాలి. మీరు ప్రారంభించే వ్యాపారానికి దగ్గరి సంబంధంగా ఉన్న మరో వ్యాపారం ఉండడం వల్ల మీకు కలిసి వస్తుంది. అయితే కొన్నిసార్లు మీకు సంబంధించిన వ్యాపారం ఉన్నచోట ఏర్పాటు చేయడం వల్ల కలిసి వస్తుంది.

    వ్యాపారానికి సరైన నిధులు సమకూర్చుకోవాలి. ఎందుకంటే వ్యాపారం స్ట్రార్ట్ చేయగానే లాభాలు వస్తాయని అస్సలు అనుకోవద్దు.కనీసం ఏడాదిపాటు వెయిట్ చేయాలి. అప్పటి వరకు లాభ, నష్టాల అంచనా తెలిసిపోతుంది. ఆ తరువాత వ్యాపారాన్ని కొనసాగించాలా? లేదా? అనేది నిర్ణయించుకోవాలి. అయితే అప్పటి వరకు వ్యాపారం సాగడానికి సరైన నిధులు ఉండడం వల్ల ఇబ్బందులు ఏర్పడకుండా ఉంటాయి.

    వ్యాపారం ప్రారంభించే ముందు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. రిజిస్ట్రేషన్ లేకపోతే ఇది తప్పుు డు వ్యాపారం అవుతుంది. అయితే చాలా మందికి దీని కోసం ఎవరిని సంప్రదించాలి? అనే అవగాహన ఉండదు. అయితే కొందరు ఈ పనులు చేయడానికి Build My Business పేరిట ప్రత్యేకంగా సంస్థను ఏర్పాటు చేశారు. వీరిని సంప్రదించడం వల్ల బిజినెన్ ను ఎలా రిజిస్ట్రేషన్ తో పాటు జీఎస్టీ లైసెన్స్, ఆడిటింగ్, తదితర విషయాలకు సంబంధించిన పనులన్నీ వీరు చేస్తారు. వీరిని సంప్రదించాలంటే https://buildmybusiness.in అనే వెబ్ సైట్ ను సంప్రదించాలి. ఈ వెబ్ సైట్ లో వాళ్ల కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది. వారిని సంప్రదించి వ్యాపారానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.