https://oktelugu.com/

ప్రజలకు అందుబాటులోకి కొత్త గ్యాస్ సిలిండర్లు.. వీటి వల్ల లాభాలివే..?

దేశంలోని కోట్ల సంఖ్యలో ప్రజలు గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు అదిరిపోయే తీపికబురు అందించింది. స్మార్ట్ ఎల్‌పీజీ సిలిండర్, కంపొసైట్ గ్యాస్ సిలిండర్ లను గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. చూడటానికి సాధారణ గ్యాస్ సిలిండర్లకు భిన్నంగా ఉండే ఈ గ్యాస్ సిలిండర్ల వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ కొత్త గ్యాస్ సిలిండర్ల లుక్ కూడా అదిరిపోయిందని గ్యాస్ సిలిండర్ల వినియోగదారులు కామెంట్లు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : July 17, 2021 9:27 am
    Follow us on

    దేశంలోని కోట్ల సంఖ్యలో ప్రజలు గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు అదిరిపోయే తీపికబురు అందించింది. స్మార్ట్ ఎల్‌పీజీ సిలిండర్, కంపొసైట్ గ్యాస్ సిలిండర్ లను గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. చూడటానికి సాధారణ గ్యాస్ సిలిండర్లకు భిన్నంగా ఉండే ఈ గ్యాస్ సిలిండర్ల వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.

    ఈ కొత్త గ్యాస్ సిలిండర్ల లుక్ కూడా అదిరిపోయిందని గ్యాస్ సిలిండర్ల వినియోగదారులు కామెంట్లు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇండేన్ గ్యాస్ కస్టమర్లు మాత్రమే ఈ గ్యాస్ సిలిండర్లను పొందే అవకాశం ఉండగా ప్రస్తుతం ఐఓసీఎల్ మాత్రమే మార్కెట్ లోకి ఈ గ్యాస్ సిలిండర్లను అందుబాటులోకి తెస్తుండటం గమనార్హం. ఈ గ్యాస్ సిలిండర్లను తీసుకోవడం ద్వారా గ్యాస్ సిలిండర్ లో ఎంత గ్యాస్ ఉందో సులభంగా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది.

    సాధారణ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బరువుగా ఉంటుందనే సంగతి తెలిసిందే. కొత్త గ్యాస్ సిలిండర్ల బరువు మాత్రం సగం కంటే తక్కువగా ఉండటం గమనార్హం. ఈ గ్యాస్ సిలిండర్లను సులభంగానే ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకొని వెళ్లవచ్చు. మార్కెట్ లో 5 కేజీల గ్యాస్ సిలిండర్లతో పాటు 10 కేజీల గ్యాస్ సిలిండర్లు సైతం అందుబాటులో ఉన్నాయి. ఈ సిలిండర్ల వల్ల ఫ్లోర్ కూడా శుభ్రంగా కనిపించే అవకాశం ఉంటుంది.

    తుప్పు పట్టకపోవడం ఈ స్మార్ట్ సిలిండర్ల స్పెషాలిటీ అని చెప్పవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ ఏరియాలో మాత్రమే ఈ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. ఇండేన్ గ్యాస్ కస్టమర్లు ఈ సిలిండర్ ను పొందాలంటే సమీపంలోని గ్యాస్ సిలిండర్ డిస్ట్రిబ్యూటర్ ను సంప్రదించాల్సి ఉంటుంది.