దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ వల్ల లక్షల సంఖ్యలో ప్రజలు ఉద్యోగాలను కోల్పోయారు. కరోనా విజృంభణ వల్ల వ్యాపారాలపై కూడా ప్రతికూల ప్రభావం పడటం గమనార్హం. ఇలాంటి సమయంలో తక్కువ మొత్తం ఖర్చుతో సులభంగా డబ్బులను సంపాదించే అవకాశం ఉంది. ఐఆర్‌సీటీసీ ఏజెంట్ గా పని చేయడం ద్వారా సులభంగా తక్కువ సమయంలోనే డబ్బును సంపాదించే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.
ఐఆర్‌సీటీసీ ఏజెంట్‌గా పని చేయడం వల్ల నెలకు ఏకంగా 30,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు ట్రైన్ టికెట్స్ బుకింగ్ ద్వారా ఆదాయం పొందవచ్చు. కమీషన్ రూపంలో ఈ ఆదాయాన్ని పొందే అవకాశం ఉండగా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. అయితే రైల్ ట్రావెల్ సర్వీస్ ఏజెంట్ గా పని చేయడానికి అందరూ అర్హులు కాదు. కనీసం ఇంటర్ చదివిన వాళ్లు మాత్రమే ఐఆర్‌సీటీసీ ఏజెంట్‌గా పని చేయవచ్చు.
ఐఆర్‌సీటీసీ ఏజెంట్‌గా చేరాలంటే ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏజెంట్ గా దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్, పాన్ కార్డ్ తో పాటు ఈమెయిల్, మొబైల్ నంబర్, అడ్రస్, ఇతర వివరాలను అందజేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 30,000 రూపాయలతో ఐఆర్‌సీటీసీ పేరుపై డీడీ తియ్యాలి. డీడీ తీసిన మొత్తంలో 20,000 రూపాయలు వెనక్కు వస్తాయని సమాచారం.
ఐఆర్‌సీటీసీతో అగ్రిమెంట్ ను పూర్తి చేసిన తరువాత 20,000 రూపాయలు వెనక్కు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆ తరువాత సంవత్సరానికి 5,000 రూపాయల చొప్పున ఐఆర్‌సీటీసీకి రెన్యువల్ ఫీజును చెలించాల్సి ఉంటుంది.