Sleeping competition: మీరు నిద్రప్రియులా… అయితే లక్షలు సంపాదించే అవకాశం మీ సొంతం.. ఎలాగో తెలుసా?

Sleeping competition: సాధారణంగా కొందరికి నిద్ర అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. ఈ క్రమంలోనే కొంత విరామ సమయం దొరికినా అలా ఒక కునుకు తీస్తారు. అయితే ఈ విధంగా నిద్ర అంటే ఇష్టం ఉన్న వారికి ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు. నిద్రపోతూ లక్షలు సంపాదించే అవకాశం మీ సొంతం చేసుకునే అదృష్టాన్నివేక్‌ఫిట్ బ్యాచ్ 2021-22 స్లీప్ ఇంటర్న్‌షిప్ కల్పిస్తోంది. ఈ ఇంటర్న్‌షిప్‌లో పాల్గొనేవారు ఎలాంటి పని చేయాల్సిన పనిలేదు రోజుకు 9 గంటల […]

Written By: Navya, Updated On : November 20, 2021 1:18 pm
Follow us on

Sleeping competition: సాధారణంగా కొందరికి నిద్ర అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. ఈ క్రమంలోనే కొంత విరామ సమయం దొరికినా అలా ఒక కునుకు తీస్తారు. అయితే ఈ విధంగా నిద్ర అంటే ఇష్టం ఉన్న వారికి ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు. నిద్రపోతూ లక్షలు సంపాదించే అవకాశం మీ సొంతం చేసుకునే అదృష్టాన్నివేక్‌ఫిట్ బ్యాచ్ 2021-22 స్లీప్ ఇంటర్న్‌షిప్ కల్పిస్తోంది. ఈ ఇంటర్న్‌షిప్‌లో పాల్గొనేవారు ఎలాంటి పని చేయాల్సిన పనిలేదు రోజుకు 9 గంటల పాటు కదలకుండా నిద్రపోతే చాలు ఇలా వంద రోజులు చేసిన వారికి అక్షరాలా పది లక్షల రూపాయలు నగదు బహుమతిగా ప్రకటించారు.

Also Read: మీరు విమానంలో ప్రయాణిస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే!

అయితే ప్రతిరోజు 9 గంటల పాటు బెడ్ కు మాత్రమే పరిమితమై నిద్రపోవాలి. ఇలా 100 రోజులపాటు నిద్రపోయే వారికి మాత్రమే ఈ పది లక్షలు సొంతం చేసుకొనే అవకాశం ఉంటుంది. ఈ ఇంటర్న్‌షిప్‌లో దరఖాస్తు చేసుకున్న వారిలో కొంతమందిని ఎంపిక చేసి వందరోజుల ఇంటర్న్‌షిప్‌ కి అర్హత కల్పిస్తారు. ఇందులో అర్హత సాధించిన ప్రతి ఒక్కరికీ లక్ష రూపాయలు చొప్పున చెల్లిస్తారు. అయితే వంద రోజులు ఇందులో పాల్గొన్న వారికి పది లక్షల రూపాయల బహుమతి అందిస్తారు.

అయితే ఈ పోటీలో పాల్గొనాలి అనుకుంటే వెంటనే
https://wakefit.co/sleepintern ఈ వెబ్ సైట్ లో మీ డీటెయిల్స్ పొందుపరచాలి. అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకటికి రెండుసార్లు చదివి ఇందులో మీ పేరు నమోదు చేసుకోవాలని వెల్లడించారు.ఏది ఏమైనా ఇలా నిద్రపోతూ లక్షలు సంపాదించవచ్చు అంటే వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉన్నా ఈ పోటీలో పాల్గొనడానికి ఎంతోమంది యువకులు ఆసక్తి చూపుతూ దరఖాస్తు చేసుకుంటున్నారు. మరెందుకు ఆలస్యం మీరు కూడా నిద్రపోతూ 10 లక్షలు గెలుచుకోవడానికి ప్రయత్నించండి.

Also Read: ప్రముఖ సంస్థలో భారీ వేతనంతో జాబ్స్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?