Karthika Deepam: మరోసారి తన కుటుంబానికి షాకివ్వనున్న దీప.. మోనిత కొడుకు బారసాలకు అందరం వస్తామని మాటిచ్చిన వంటలక్క!

బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు ఎంతో ప్రేక్షకాదరణ దక్కించుకుని మంచి రేటింగ్స్ తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ లో భాగంగా దీప తన కుటుంబ సభ్యులందరితోను వింతగా ప్రవర్తిస్తూ సంతోషంగా ఉంటూ అందరి చేత దీపావళి పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటుంది. తన జీవితంలో మళ్లీ దీపావళి పండుగ ఎప్పుడు వస్తుందో అంటూ మాట్లాడుతూనే ఈ పండుగను జరుపుకోవడంతో కార్తీక్ సౌందర్య ఆనందరావు ఆదిత్య దీప ప్రవర్తన చూసి భయపడతారు. ఇక […]

Written By: Navya, Updated On : November 20, 2021 12:26 pm
Follow us on

బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు ఎంతో ప్రేక్షకాదరణ దక్కించుకుని మంచి రేటింగ్స్ తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ లో భాగంగా దీప తన కుటుంబ సభ్యులందరితోను వింతగా ప్రవర్తిస్తూ సంతోషంగా ఉంటూ అందరి చేత దీపావళి పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటుంది. తన జీవితంలో మళ్లీ దీపావళి పండుగ ఎప్పుడు వస్తుందో అంటూ మాట్లాడుతూనే ఈ పండుగను జరుపుకోవడంతో కార్తీక్ సౌందర్య ఆనందరావు ఆదిత్య దీప ప్రవర్తన చూసి భయపడతారు.

ఇక అందరూ కలిసి టపాకాయలు కాలుస్తున్న సమయంలో మోనితా సౌందర్యకి ఫోన్ చేసి బాబుకు బాగా లేదు కార్తీక్ ని పంపించమని కోరుతుంది. ఆ మాటకు సౌందర్య ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది. ఈ క్రమంలోనే కార్తిక్ దీప జాగ్రత్తగా కాల్చు చీర అంటుకుంటుంది అంటూ చెబుతాడు. ఆ మాటలు ఫోన్లో విన్న మోనిత ఎంతో మండిపోతూ ఫోన్ కట్ చేస్తుంది.ఇక నన్ను పట్టించుకోకుండా ఆ వంటలక్క తో సరదాగా గడుపుతున్నావా అంటూ మోనిత కోపడుతుంది.

అంతేలో ప్రియమణి రావడం చేత ప్రియమణిపై మోనిత గట్టి గట్టిగా అరుస్తుంది. ఇక ఆనందరావు సౌందర్య కార్తీక్ మాట్లాడుతూ దీప ఏదో చివరి నిర్ణయం అంటోంది అంటూ తన గురించి ఆలోచిస్తూ బాధపడతారు. అదే సమయంలోనే పిల్లలతో దీప ఎంతో సంతోషంగా నడుచుకుంటూ లోపలికి వెళ్తూ చాలు అమ్మ నవ్వలేకపోతున్నాము అంటూ చెబుతారు. నాన్న అమ్మ ఎలా జోకులు వేసి నవ్విస్తూ ఉందో తెలుసా అని చెబుతూనే ఈ రోజు అమ్మ పుట్టిన రోజు ఏం గిఫ్ట్ ఇచ్చావు అని అడగడంతో అందుకు దీప మీ నాన్న నాకు అందరికంటే ముందుగా పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు అని చెప్తుంది. ఆ మాటలకు సౌందర్య, కార్తీక్ బాధపడతారు.

అంతలోనే అక్కడికి మోనిత రావడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. మోనిత రావడం చూసిన డాక్టర్ బాబు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి ముందు బయటికి వెళ్ళు అంటూ గట్టిగా అరుస్తాడు. అప్పుడు దీప ఇంటికి వచ్చిన అతిథులను అలా పంపిస్తారు ఏంటి డాక్టర్ బాబు అంటూ దీప మాట్లాడటంతో మోనిత షాక్ అవుతుంది. ఈ క్రమంలోనే తన కొడుకు బారసాల ఉంది అందరూ రావాలని ఆహ్వానించగా కార్తీక్ కుటుంబం తనపై కోపం వ్యక్తం చేస్తారు. ఆ సమయంలో దీప నువ్వు వెళ్లి నీ కొడుకు బారసాల ఏర్పాట్లు చేసుకో అందరిని తీసుకువచ్చే బాధ్యత నాది అంటూ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. అసలైన క్లైమాక్స్ రేపే ఉంటుంది అంటూ దీప చెబుతుంది. అయితే తరువాత ఎపిసోడ్ లో దీప ఎవరికి ఎలాంటి షాక్ ఇవ్వబోతుందో తెలియాల్సి ఉంది.