kaikala satyanarayana: ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ(88)కు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది సినీ కళాకారులు అనారోగ్యం, కరోనా బారిన పడి కన్నుమూశారు. ఈ క్రమంలోనే టాలీవుడ్లో ఆందోళన నెలకొంది. త్వరలో సత్యనారాయణ కోలుకోవాలని సినీ తారలు, అభిమానులు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.
ఇటీవల కైకాల సత్యనారాయణ ఇంట్లో కారు జారిపడిన సంగతి తెలిసిందే. సికింద్రబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అంతలోనే మళ్లీ ఇలా కావడం ఆందోళన కలిగిస్తోంది.
కాగా, సినీ పరిశ్రమలో ఎనలేని ఖ్యాతి సాధించారు కైకాల. విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించి మెప్పించారు. 1959 లో సిపాయి కూతురు సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టారు కైకాల. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా అన్ని పాత్రలకు జీవం పోసి.. నవరస నట సార్వభౌమగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బిరుదు పొందిన ఏకైక వ్యక్తి కైకాల. తనదైన నటనలో అభిమానులను అలరించడమే కాదు.. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని రాసుకున్నారు. గడిచిన 60 ఏళ్లలో సినీ రంగంలో ఉన్న కైకాల గత కొంతకాలం క్రితం వరకూ తండ్రి, తాత పాత్రలను పోషించారు. ఇప్పటి వరకు ఆయన తన కెరీర్లో 777 సినిమాల్లో నటించారు.