Homeబిజినెస్Skoda : కొత్త స్కోడా కొడియాక్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Skoda : కొత్త స్కోడా కొడియాక్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Skoda : స్కోడా ఆటో ఇండియా తమ సెకండ్ జనరేషన్ 2025 స్కోడా కొడియాక్‌ను భారతీయ మార్కెట్‌లో విడుదల చేసింది. ఏడు కలర్ ఆఫ్షన్లలో విడుదలైన ఈ కొత్త ఫుల్-సైజ్ SUVని కంపెనీ స్పోర్ట్‌లైన్, L&K అనే రెండు వేరియంట్‌లలో విడుదల చేసింది. ఈ SUV ధర ఎంత, ఈ కారులో ఏ ఇంజన్ అందించారో పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

డిజైన్:
ఎక్స్‌టీరియర్: ఈ SUVలో కొత్త బంపర్‌లు, LED హెడ్‌ల్యాంప్‌లు, 18-ఇంచుల అల్లాయ్ వీల్స్, C-ఆకారపు LED టెయిల్ లైట్స్, రూఫ్ రైల్ వంటి మార్పులు చూడవచ్చు. కొత్త గ్రిల్, స్లీక్ LED హెడ్‌ల్యాంప్‌ల కారణంగా ఈ కారు మునుపటి కంటే లుక్ మరింత ప్రీమియంగా కనిపిస్తుంది. సైడ్ ప్రొఫైల్‌లో క్యారెక్టర్ లైన్స్ తక్కువగా ఉండటం వల్ల ఈ SUV పొడవుగా కనిపిస్తుంది. ఈ కారు పొడవు దాదాపు 15 అడుగుల 7 అంగుళాలు. కొడియాక్ వెనుక భాగంలో కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్స్‌కు బదులుగా పూర్తి వెడల్పులో ఎరుపు రంగు చార ఉంది, కానీ అందులో లైట్ లేదు. మొత్తంమీద ఈ కారు యొక్క మొత్తం ఎక్స్‌టీరియర్ చాలా ప్రీమియం లుక్‌ను అందిస్తుంది.

Also Read : రెండు నెలల్లోనే 5 స్టార్ రేటింగ్.. టాటాకు కియా సవాల్

ఇంటీరియర్: ఈ SUV ఇంటీరియర్‌లో ప్రీమియం, సాఫ్ట్ టచ్ మెటీరియల్‌ను అందించారు. ఇది ఈ సెగ్మెంట్ కారులో అవసరం కూడా. ఈ కారులో మసాజ్ నుండి యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, కార్ ప్లే వంటి అనేక అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. కారు డ్రైవర్ సీటు లేదా మూడవ వరుస సీటు ప్రతిచోటా ఛార్జింగ్ కోసం సి-టైప్ ఛార్జింగ్ పోర్ట్‌ను అందించారు.

స్కోడా కొడియాక్ ఫీచర్లు: ఈ కారులో 12.9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, ముందు సీట్లలో హీటింగ్, వెంటిలేషన్ సిస్టమ్, మసాజ్ ఫంక్షన్, స్లైడింగ్ , రీక్లైనింగ్ సెకండ్ రో సీట్, సబ్ వూఫర్‌తో ప్రీమియం 13-స్పీకర్ ఆడియో సిస్టమ్ వంటి తాజా ఫీచర్లు ఉన్నాయి.

సేఫ్టీ ఫీచర్లు:
స్కోడా ఈ కారులో ప్రయాణికుల భద్రతకు పెద్ద పీట వేశారు. ఈ ఫుల్-సైజ్ SUVలో 9 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఈ SUVలో 9 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు 360-డిగ్రీ వ్యూ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్, EBD, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

ఇంజన్ వివరాలు:
స్కోడా కొడియాక్ 2025లో కంపెనీ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను అందించింది, ఇది 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఈ శక్తివంతమైన ఇంజన్ 201bhp పవర్, 320Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ SUVతో మీకు గేర్ షిఫ్టింగ్ ఎక్కువగా అనిపించదు. కానీ ఈ కారు సస్పెన్షన్, డ్రైవ్ చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఈ కారులో స్మూత్ డ్రైవ్, పవర్‌ఫుల్ ఇంజన్ నుండి కంఫర్ట్ వరకు అన్నీ లభిస్తాయి.

2025 స్కోడా కొడియాక్ ధర :
ఈ కారు స్పోర్ట్‌లైన్ వేరియంట్ ధర రూ.46.89లక్షల (ఎక్స్-షోరూమ్). కానీ మీరు ఈ కారు L&K వేరియంట్‌ను కొనుగోలు చేస్తే, రూ.48.69 లక్షల(ఎక్స్-షోరూమ్) ఖర్చు చేయాల్సి ఉంటుంది. స్కోడా ఈ కొత్త ఫుల్-సైజ్ SUV మార్కెట్‌లోకి ప్రవేశించడంతో టయోటా ఫార్చ్యూనర్, MG గ్లోస్టర్ వంటి కార్లకు గట్టి పోటీ ఎదురుకానుంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular