దేశంలో వేసవి కాలం మొదలైంది. ఎండలు అంతకంతకూ పెరుగుతున్నాయి. వేసవి కాలం కావడంతో ఏసీ, కూలర్లు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతుండగా వాటిని కొనుగోలు చేసేవాళ్లకు అదిరిపోయే ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. కేవలం 6 వేల నుంచి 10,000 రూపాయలకే ఏసీని కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం కొత్త ఏసీని కొనుగోలు చేయాలంటే రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంది.
ఈ కారణం వల్లే చాలామంది ఏసీ కొనుగోలు చేయాలంటే భయపడుతున్నారు. అయితే ఓఎల్‌ఎక్స్, క్వికర్ మరికొన్ని వెబ్ సైట్ల ద్వారా సెకండ్ హ్యాండ్ ఏసీలను తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఓపికగా ఆన్ లైన్ లో సెర్చ్ చేస్తే తక్కువ ధరకే మంచి ఏసీ లభించే అవకాశం ఉంటుంది. సెకండ్ హ్యాండ్ ఏసీల పనితీరు కూడా బాగానే ఉంటుంది. అదే సమయంలో తక్కువ ధరకే మనకు మంచి ఏసీ లభిస్తుంది.
రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఏసీ లేకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవనే చెప్పాలి. అయితే ఏసీని వాడే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం తయారవుతున్న ఏసీలలో ఎక్కువగా ఆర్ – 290 గ్యాస్ వాడుతున్నారు. అయితే పాతరకం ఏసీలలో మాత్రం హైడ్రో క్లోరో ఫ్లోరో కార్బన్స్ ను ఎక్కువగా వినియోగించేవారు.
క్లోరో ఫ్లోరో కార్బన్స్ లీకైతే ఆ ప్రభావం శరీరంపై పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఏసీ నుంచి గ్యాస్ లీకేజీని గ్రహించడం కష్టమైన పని అయినా తరచూ ఏసీలను పరిశీలిస్తూ ఉంటే మంచిది.