దేశంలో ఎమర్జెన్సీ అవసరమేనా?

కల్లోల భారతవాణి కరోనా ధాటికి చిగురుటాకులా వణుకుతోంది. గత సంవత్సరం వచ్చిన కరోనా సెకండ్ వేవ్ తో ఉరుముతుంటే చేష్టలుడిగి చూస్తున్న కేంద్రప్రభుత్వ అసమర్థతను ఆ మహమ్మారి ప్రశ్నిస్తోంది. ఒకసారి వచ్చినా రెండోసారి మేల్కోని ప్రభుత్వ తీరును తాజాగా సుప్రీంకోర్టు సైతం కడిగేసింది. దేశంలో కరోనాతో కల్లోలం వాతావరణం చోటుచేసుకుంది. ఆక్సిజన్ అందక ప్రాణాలు పోతున్నాయి. అత్యవసర మందులు బ్లాక్ మార్కెట్ కు తరలిపోయాయి. రెమెడిసివిర్ లాంటి యాంటీ వైరల్ డ్రగ్స్ ఒక్కోటి రూ.75వేల నుంచి రూ.2 […]

Written By: NARESH, Updated On : April 22, 2021 5:40 pm
Follow us on


కల్లోల భారతవాణి కరోనా ధాటికి చిగురుటాకులా వణుకుతోంది. గత సంవత్సరం వచ్చిన కరోనా సెకండ్ వేవ్ తో ఉరుముతుంటే చేష్టలుడిగి చూస్తున్న కేంద్రప్రభుత్వ అసమర్థతను ఆ మహమ్మారి ప్రశ్నిస్తోంది. ఒకసారి వచ్చినా రెండోసారి మేల్కోని ప్రభుత్వ తీరును తాజాగా సుప్రీంకోర్టు సైతం కడిగేసింది.

దేశంలో కరోనాతో కల్లోలం వాతావరణం చోటుచేసుకుంది. ఆక్సిజన్ అందక ప్రాణాలు పోతున్నాయి. అత్యవసర మందులు బ్లాక్ మార్కెట్ కు తరలిపోయాయి. రెమెడిసివిర్ లాంటి యాంటీ వైరల్ డ్రగ్స్ ఒక్కోటి రూ.75వేల నుంచి రూ.2 లక్షల వరకు డిమాండ్ బట్టి తీసుకుంటున్నారు. ఆస్పత్రుల్లో రూ.2.50 లక్షలు కడితేనే ఒక బెడ్ ఇస్తున్నారు. ఇంతటి విపత్కర ‘కరోనా ఎమర్జెన్సీ’ వాతావరణంలో సుప్రీంకోర్టు స్పందించింది. దీన్ని దేశంలో ‘ఆరోగ్య ఎమర్జెన్సీ’గా ప్రకటించింది.

కరోనా చేయిదాటిపోతున్న వేళ సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటాగా తీసుకోవడం చర్చనీయాంశమైంది. కరోనా మహమ్మారి ఇంత ప్రబలుతున్న వేళ కరోనా నియంత్రణ చర్యలు తీసుకోలేని కేంద్రప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు టార్గెట్ చేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా దీనిపై కేంద్రానికి నోటీసులు జారీ చేయడం సంచలనమైంది.

దేశంలో ఆక్సిజన్ సరఫరా జరగక రోగులు ప్రాణాలు పోతున్నాయి. నాసిక్ లో అయితే 24 మంది చనిపోయారు. ఇక మందుల సరఫరాల జరగడం లేదు. కొరత ఏర్పడింది. వ్యాక్సినేషన్ ముందుకు సాగడం లేదు. లాక్ డౌన్ చివరి అస్త్రమని కేంద్రం చెప్పింది. ఈ క్రమంలోనే కరోనా కల్లోల పరిస్థితిని మోడీ సర్కార్ చేష్టలుడిగి చూస్తున్నట్టు అర్థమవుతోంది.

దీంతోనే సుప్రీంకోర్టు ఎంట్రీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పరిస్థితిని జాతీయ అత్యవసర స్థితిని తలపిస్తోందని చీఫ్ జస్టిస్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం మోడీ సర్కార్ వైఫల్యాన్ని ఎత్తిచూపినట్టైంది. నేషనల్ ఎమర్జెన్సీ అంటే అంతకంటే తీవ్ర పదజాలం మరొకటి ఉండదు. అంటే కేంద్రంలోని మోడీ సర్కార్ ఈ కరోనా నియంత్రణలో విఫలమైనట్టే లెక్క. ఇప్పటికే సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. దీనిపై కేంద్రం ఏం సమాధానం చెబుతుందో చూడాలి.

అయితే సుప్రీంకోర్టు కరోనా విషయంలో జోక్యం చేసుకోవడం.. ఎమర్జెన్సీలా దేశం ఉందన్న వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దేశంలో కరోనా తీవ్రతకు ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. ఎమర్జెన్సీ అంటే దేశం అల్లకల్లోలంగా ఉన్నట్టే లెక్క. మరీ సుప్రీంకోర్టు హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం లాక్ డౌన్ విధిస్తుందా? ఎలాంటి చర్యలు చేపడుతుందనేది ఆసక్తిగా మారింది.