
కోవిడ్ 19 మహమ్మారి 24 గంటల్లో 3.14 లక్షల కేసులతో ప్రపంచ రికార్టు సాధించిన నేపథ్యంలో సుప్రీం కోర్టు కేంద్రం ప్రభుత్వం పై ఆగ్రం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ముఖ్యమైన మందుల సరఫరా వ్యాక్సినేషన్ విధానం పై ఓ జాతీయ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించింది. దేశంలోని ఆరు హైకోర్టుల్లొో కోవిడ్ 19 మహమ్మారి సంబంధిత కేసులు విచారణలో ఉన్నాయి. ఆక్సిజన్ కొరత, ఆసుపత్రుల్లొో పడకలు, యాంటి వైరల్ డ్రగ్ రెమ్ డెసివిర్ అందుబాటులో లేకపోవడంపై దాఖలైన పిటిషన్లను హైకోర్టులు విచారిస్తున్నాయి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బాబ్డే గురువారం మాట్లాడుతూ ఈ సమస్య స్వీయ విచారణ జరపాలనుకుంటున్నట్లు తెలిపారు.