రోజుకు రూ.50 ఆదా చేస్తే రూ.50 లక్షలు.. ఎలా అంటే..?

ప్రస్తుత కాలంలో డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కరోనా కష్టాలు మొదలైన తరువాత ఉద్యోగం కోల్పోవడం, వ్యాపారాలలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యల వల్ల ప్రజలకు డబ్బు అవసరం మరింత పెరిగింది. అయితే పిల్లల కొరకు లేదా ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి డబ్బు ఆదా చేయాలని భావించే వాళ్ల కొరకు పోస్టాఫీస్ అద్భుతమైన స్కీమ్ ను ఆఫర్ చేస్తోంది. దీర్ఘకాలంలో ఎక్కువ రాబడిని ఆశించేవాళ్లు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. మ్యూచువల్ ఫండ్స్ […]

Written By: Navya, Updated On : May 3, 2021 1:53 pm
Follow us on

ప్రస్తుత కాలంలో డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కరోనా కష్టాలు మొదలైన తరువాత ఉద్యోగం కోల్పోవడం, వ్యాపారాలలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యల వల్ల ప్రజలకు డబ్బు అవసరం మరింత పెరిగింది. అయితే పిల్లల కొరకు లేదా ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి డబ్బు ఆదా చేయాలని భావించే వాళ్ల కొరకు పోస్టాఫీస్ అద్భుతమైన స్కీమ్ ను ఆఫర్ చేస్తోంది.

దీర్ఘకాలంలో ఎక్కువ రాబడిని ఆశించేవాళ్లు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. మ్యూచువల్ ఫండ్స్ కాకుండా ఇతర స్కీమ్స్ అయిన ఫిక్స్ డ్ డిపాజిట్లు, పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. మ్యూచువల్ ఫండ్స్ లో ప్రస్తుతం 12 నుంచి 15 శాతం రాబడి వస్తుండగా కొన్నిసార్లు మరింత ఎక్కువ రాబడి వస్తుంది. నెలకు 1,000 రూపాయల చొప్పున మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే 20 సంవత్సరాల తర్వాత ఏకంగా 20 లక్షలు పొందవచ్చు.

నెలకు 500 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే మాత్రం 20 సంవత్సరాల తర్వత 5 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ లో టెన్యూర్ పెరిగే కొద్దీ వచ్చే డబ్బులు కూడా పెరుగుతాయి. రోజుకు 50 రూపాయల చొప్పున ఆదా చేసి నెలకు 1,500 రూపాయలు 30 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే 30 సంవత్సరాల తర్వాత ఏకంగా 50 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంది.

డబ్బులు ఇన్వెస్ట్ చేసేవాళ్లు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఎంచుకుంటే తక్కువ పెట్టుబడితో లక్షాధికారులు కావడంతో పాటు ఎక్కువ లాభాలను పొందే అవకాశాం ఉంటుంది.