https://oktelugu.com/

కేటీఆర్ పట్టాభిషేకం కోసమే ‘ఈటల’ను బలి చేశారా?

తెలంగాణలో దాదాపు అన్నిరకాల ఎన్నికలు నేటితో ముగియనున్నాయి. ఈ తరుణంలో గత రెండుమూడ్రోజులుగా ఈటల రాజేందర్ వ్యవహరం హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్లుగా రాజకీయాలు వేడెక్కాయి. అయితే ఉన్నఫలంగా ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం వెనుక వేరే కారణాలు ఉన్నాయనే టాక్ విన్పిస్తోంది. సీఎం కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక మంత్రి హరీష్ రావు.. ఈటల రాజేందర్ లకు కొద్దిరోజులు మంత్రి పదవులు […]

Written By: , Updated On : May 3, 2021 / 01:02 PM IST
Follow us on

తెలంగాణలో దాదాపు అన్నిరకాల ఎన్నికలు నేటితో ముగియనున్నాయి. ఈ తరుణంలో గత రెండుమూడ్రోజులుగా ఈటల రాజేందర్ వ్యవహరం హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్లుగా రాజకీయాలు వేడెక్కాయి. అయితే ఉన్నఫలంగా ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం వెనుక వేరే కారణాలు ఉన్నాయనే టాక్ విన్పిస్తోంది.

సీఎం కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక మంత్రి హరీష్ రావు.. ఈటల రాజేందర్ లకు కొద్దిరోజులు మంత్రి పదవులు దక్కలేదు. కేటీఆర్ ఒత్తిడితో నాడు కేసీఆర్ తన అల్లుడు హరీష్ రావుకు ఆర్థిక మంత్రి పదవిని.. ఈటల రాజేందర్ కు ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చారనే టాక్ ఉంది. ఇక తన కుమారుడికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవీతోపాటు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి పదవీ కేసీఆర్ కట్టబెట్టారు.

ఇదే సమయంలో మంత్రి కేటీఆర్ కు సీఎం కేసీఆర్ పట్టాభిషేకం చేస్తారనే చర్చ పలు దఫాలుగా విన్పించాయి. ఈ విషయంపై మంత్రులు పోటీపడిమరీ కాబోయే సీఎం కేటీఆర్ అంటూ ప్రచారం చేశారు. దీనిపై కొన్నిరోజులు స్తబ్ధుగా ఉన్న కేసీఆర్ గతంలో ఓసారి స్పందిస్తూ తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్పష్టం చేశారు. జాతకాలను ఎక్కువగా నమ్మే కేసీఆర్ మనస్సులో మాత్రం కేటీఆర్ కు పట్టాభిషేకం చేసి తాను జాతీయ రాజకీయాల్లో వెళ్లాలనే ఆలోచన ఉందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.

సీఎం కేసీఆర్ పలుసార్లు జాతీయ రాజకీయాలపై తన మనస్సులోని మాటను బయటపెట్టారు. 2018 ఎన్నికలకు ముందు ఫ్రెడరల్ ఫ్రంట్ కోసం యత్నించారు. అయితే అది విఫలం కావడంతో తన ఆలోచనను విరమించుకొని సీఎంగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు లేకపోవడంతో కేటీఆర్ కు పట్టాభిషేకం చేస్తారనే టాక్ మరోసారి విన్పిస్తోంది. దీనిలో భాగంగానే ఈటల రాజేందర్ ను బలి పశువును చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కేటీఆర్ కు అనుకూలంగా లేనివారిని తప్పించే ప్రక్రియలో భాగంగా ఈటలపై భూ ఆక్రమాల ఆరోపణలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ముందస్తు ప్రణాళికలో భాగంగా టీఆర్ఎస్ అనుకూల మీడియా ఈటల రాజేందర్ పై బురద జల్లే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. కేటీఆర్ విషయంలో ఎవరైనా గీత దాటితే ఎంతటివారైనా వేటు తప్పదనే హెచ్చరికలను కేసీఆర్ మంత్రులకు పంపించినట్లు తాజా సంఘటన తేటతెల్లం చేస్తుంది. అయితే ఈటల వ్యవహారానికి కేటీఆర్ పట్టాభిషేకం లింకు ఉందా? లేదా అనేది మాత్రం తేలాల్సి ఉంది.