Homeఎంటర్టైన్మెంట్Online Movie Tickets: తెలంగాణలోనూ ఆన్​లైన్​ సినిమా టికెట్ల విధానం తీసుకురావాలి- కేతిరెడ్డి

Online Movie Tickets: తెలంగాణలోనూ ఆన్​లైన్​ సినిమా టికెట్ల విధానం తీసుకురావాలి- కేతిరెడ్డి

Online Movie Tickets: ఇటీవల ఏపీలో ఆన్​లైన్ సినిమా​ టికెట్ల వ్యవహారం పెద్ద చర్చగా మారింది. దీనికి తోడు సినిమా థియేటర్లు టికెట్లను తక్కువ ధరకు విక్రయించాలని ప్రవేశపెట్టిన బిల్లుకు వ్యతిరేకంకా పలువురు సినీ నిర్మాతలు, సినీ తారలు సీఎం జగనకు విజ్ఞప్తి చేశారు. ఇటీవలే ఆర్​ఆర్​ఆర్​ నిర్మాత కూడా ఈ విషయంపై స్పందించిన సంగతి తెలిసిందే. మరోవైపు, చిరంజీవి కూడా ట్విట్టర్​ వేదికగా జగన్​కు విజ్ఞప్తి చేస్తూ.. లేఖ రాశారు.

Online Movie Tickets
Online Movie Tickets

Also Read: సినిమా టికెట్ ధరల విషయంలో ఏపీ సీఎం జగన్​కు చిరు విజ్ఞప్తి
థియేటర్ల మనుగడ కోసం, సినిమానే ఆధారంగా బతుకున్న ఎంతో మంది కుటుంబాల కోసం, తగ్గించిన టికెట్​ ధరలను.. సముచితంగా.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా నిర్ణయిస్తే అదరికీ మేలు జరుగుతుందని చిరు తెలిపారు. దేశమంతా ఒకటే జీఎస్టీ ఉన్నప్పుడూ.. టికెట్ ధరల విషయంలో అదే వెసులుబాటు ఎందుకు ఉండకూడదని అన్నారు. దయచేసి ఈ విషయంపై పునరాలోచన చేయాలని జగన్​ను విన్నపించుకుంటూ ట్వీట్​ చేశారు.

కాగా, తాజాగా, ఆన్​లైన్​ టికెట్​ విధానాన్ని తెలంగాణాలోనూ తీసుకురావాలని తెలుగు ఫిల్మ్​ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్​ ఆఫ్​ ఏపీ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్​రెడ్డి.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కోరారు.  ఏపీ ప్రభుత్వం లాగే.. సినిమా టికెట్లను ఆన్​లైన్​లో అమ్మాలని మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం ఈ విషయం హాట్​టాపిక్​గా మారింది.  మరి ఈ విషయంపై సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు, ఏపీ ప్రభుత్వంతోనే ఇంకా పోరాడుతున్న సీనీ ప్రముఖులకు.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా లాగే నిర్ణయం తీసుకుంటే.. ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

Also Read: చిత్రపరిశ్రమ బతకాలంటే సినీ పెద్దలు ఏం చేయాలి?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version