Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ తన పాపులర్ బైక్ హంటర్ 350ని సరికొత్త అప్‌డేట్‌లతో మార్కెట్లోకి తీసుకురావడానికి రెడీ అవుతుంది. 2025 ఏప్రిల్ 26న ముంబై, ఢిల్లీలోని సాకేత్‌లో జరగనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్‌హుడ్ ఫెస్టివల్‌లో ఈ బైక్‌ను కొత్త సస్పెన్షన్, అద్భుతమైన ఫీచర్లతో కంపెనీ అప్ డేట్ చేయనుంది. ఈ మార్పుల వల్ల బైక్ నడిపేటప్పుడు ఝలక్ లు తగ్గడం గణనీయంగా తగ్గుతుంది. ఈ బైక్‌లో ఉన్న ఫీచర్లు ఏమిటి, మార్కెట్‌లో దీని ధర ఎంత ఉండబోతుందో వివరంగా తెలుసుకుందాం.
Also Read : స్పీడ్, రేంజ్, ధర.. ఓలా ఎస్1 ప్రో+ వర్సెస్ హీరో విడా వి2 ప్రో..ఏది బెస్ట్ ?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు వాటి లుక్, పవర్ ఫుల్ పర్ఫామెన్స్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ గతేడాది రిఫ్రెష్డ్ క్లాసిక్ 350ని విడుదల చేసిన తర్వాత ఇప్పుడు తన 350సీసీ లైనప్‌లో మిడ్-సైకిల్ అప్‌డేట్‌లను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తుంది. అయితే, హంటర్ 350 ఇప్పటికీ బ్రాండ్ పోర్ట్‌ఫోలియోలో అత్యంత స్టైలిష్ బైక్‌గా కొనసాగుతోంది. ఇప్పుడు కంపెనీ ఈ బైక్‌ను మెరుగైన సస్పెన్షన్ ఫీచర్‌తో అందించనుంది.
కొత్త సస్పెన్షన్ ఫీచర్
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350లో కంపెనీ సరికొత్త సస్పెన్షన్ ఫీచర్‌ను అందించనుంది. సస్పెన్షన్ అంటే షాకర్లు, ఇవి బైక్‌ను ఝలక్ నుండి రక్షిస్తాయి. గుంతలున్న రోడ్లపై లేదా స్పీడ్ బ్రేకర్‌లపై నుంచి వెళ్లేటప్పుడు, మంచి సస్పెన్షన్ ఉండడం వల్ల బైక్ పై కూర్చున వారికి, నడిపే వారికి ఝలక్ తక్కువగా తగులుతుంది. ఈ సిస్టమ్ సాధారణంగా ఫ్రంట్ ఫోర్క్, రియర్ షాక్‌ల రూపంలో ఉంటుంది. ఇందులో స్ప్రింగ్, డంపర్, ఇతర భాగాలు ఉంటాయి. హంటర్ 350లో వెనుక సస్పెన్షన్‌ను మెరుగుపరచడం వల్ల రైడింగ్ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.
అప్‌డేటెడ్ ఫీచర్లు, ధర
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350లో కంపెనీ సస్పెన్షన్‌తో పాటు మరికొన్ని కొత్త ఫీచర్లను కూడా చేర్చే అవకాశం ఉంది. అప్‌డేటెడ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మునుపటిలాగే 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. అయితే, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌లో మార్పులు చేసే అవకాశం ఉంది. కంపెనీ బైక్ ఇంజన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని తెలుస్తోంది. కాబట్టి కొత్త బైక్ కూడా పాత బైక్‌లాగే టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ బైక్ ధర రూ.లక్షా 50 వేల నుండి ప్రారంభమవుతోంది. కొత్త అప్‌డేట్‌ల కారణంగా ధర కొద్దిగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.