Electric Scooters : ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? ఓలా కొనాలా లేదా హీరో బైక్ కొనాలా అన్న గందరగోళంలో ఉన్నారా రెండింటిలో ఏది ఎక్కువ పవర్‌ఫుల్? ఏది ఎక్కువ రేంజ్ ఇస్తుంది అనేది తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్‌లో ఓలా ఎలక్ట్రిక్ తన ఓలా ఎస్1 ప్రోతో చాలా తక్కువ టైంలో మంచి పేరు తెచ్చుకుంది. ఇక దేశంలోనే అతిపెద్ద టూ-వీలర్ కంపెనీ అయిన హీరో మోటోకార్ప్ కూడా తన ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణిని హీరో విడా బ్రాండ్‌తో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. మరి ఈ రెండు కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది ఎక్కువ పవర్ కలిగి ఉంది. ఏది తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఇస్తుందో ఇప్పుడు చూద్దాం.
Also Read: మళ్లీ పెరగనున్న రిచార్జ్ లు.. ఎయిర్ టెల్, జీయోల నిర్ణయం..
ఓలా ఎలక్ట్రిక్‌లో బాగా అమ్ముడవుతున్న స్కూటర్ ఎస్1 ప్రో. దీని కొత్త తరం ఎస్1 ప్రో ప్లస్ ఇప్పుడు మార్కెట్‌లో ఉంది. అయితే హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అప్‌గ్రేడ్ చేసి ఇప్పుడు హీరో విడా వి2ని తీసుకొచ్చింది. ఈ రెండు స్కూటర్ల టాప్ మోడళ్ల ఆధారంగా రెండిట్లో ఏది ఎక్కువ డబ్బుకు తగిన విలువనిస్తుందో తెలుసుకుందాం.
ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర
ఏదైనా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలంటే అది మన బడ్జెట్‌లో సరిపోవాలి. ధరల పరంగా చూస్తే ఓలా ఎస్1 ప్రో+ టాప్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.48 లక్షలు. అదే హీరో విడా వి2 ప్రో (టాప్ మోడల్) ఎక్స్-షోరూమ్ ధర రూ.1.20 లక్షలు.
స్కూటర్ బ్యాటరీ పవర్
ఓలా ఎస్1 ప్రో+, హీరో విడా వి2 ప్రో స్కూటర్లలో ఉన్న ముఖ్యమైన తేడా వాటి బ్యాటరీ ప్యాక్‌లలోనే ఉంది. ఓలా స్కూటర్ ఫిక్స్‌డ్ బ్యాటరీతో వస్తే హీరో స్కూటర్‌లో రిమూవబుల్ బ్యాటరీలు ఉంటాయి. ఓలా స్కూటర్‌లో 5.3 kWh, 4 kWh బ్యాటరీ ఆప్షన్లు లభిస్తాయి. అయితే హీరో స్కూటర్‌లో రెండు రిమూవబుల్ బ్యాటరీలు ఉంటాయి. వాటి మొత్తం పవర్ 3.9 kWh.
రేంజ్ ఎవరికి ఎంత?
ఓలా ఎలక్ట్రిక్ థర్డ్ జనరేషన్ ఓలా ఎస్1 ప్రో+ 4 kWh బ్యాటరీ స్కూటర్‌ను హీరో విడా వి2 ప్రో 3.9 kWh బ్యాటరీ ప్యాక్ రేంజ్‌తో పోల్చి చూస్తే, ఓలా స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 242 కిమీ రేంజ్, గంటకు 128 కిమీ టాప్ స్పీడ్‌ను ఇస్తుందని కంపెనీ చెబుతోంది. హీరో స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 162 కిమీ రేంజ్, గంటకు 90 కిమీ టాప్ స్పీడ్ మాత్రమే ఇస్తుంది. అలాగే ఓలా స్కూటర్ 2.3 సెకన్లలో 0-40 కిమీ వేగాన్ని అందుకుంటుంది. అయితే హీరో స్కూటర్‌కు అదే వేగం అందుకోవడానికి 2.9 సెకన్లు పడుతుంది. హీరో స్కూటర్‌లో రిమూవబుల్ బ్యాటరీలతో పాటు 26 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఉండటం మంచి విషయం.
ధరకు తగిన విలువ ఎవరిది?
ఈ విషయంలో రెండు స్కూటర్లను పరిశీలిస్తే.. ఓలా స్కూటర్ పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో ఎక్కువ రేంజ్‌ను అందిస్తుంది. అంతేకాకుండా ఇది థర్డ్ జనరేషన్ మోడల్ కావడం వల్ల ముందు వాటి కంటే చాలా మెరుగైన ఉత్పత్తి. అయితే హీరో స్కూటర్ ప్రత్యేకత రిమూవబుల్ బ్యాటరీ, ఇది ఛార్జింగ్‌ను చాలా సులభతరం చేస్తుంది. రిమూవబుల్ బ్యాటరీతో పాటు మంచి బూట్ స్పేస్ కూడా ఇందులో ఉంది. అయితే ఈ రెండు స్కూటర్ల ధరలో దాదాపు రూ.30,000 తేడా ఉంది.