Renault Kiger : రెనో ఇండియా తమ పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఏకైక SUV అయిన కైగర్‌పై వినియోగదారులకు భారీ శుభవార్త అందించింది. కంపెనీ తమ వద్ద మిగిలిపోయిన 2024 మోడల్ ఇయర్ వాహనాల స్టాక్‌ను క్లియర్ చేసేందుకు ఏకంగా రూ. 88వేల వరకు తగ్గింపును ప్రకటిచింది. అయితే, కొత్తగా విడుదలైన 2025 మోడల్ ఇయర్ వాహనాలపై కూడా రూ. 58వేల వరకు ప్రయోజనం పొందవచ్చు. ఈ ఆఫర్‌లో నగదు తగ్గింపుతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్ , లాయల్టీ బెనిఫిట్‌లు కూడా ఉన్నాయి. కైగర్ ప్రారంభ వేరియంట్‌లైన RXE, RXL కొనుగోలుదారులకు లాయల్టీ బెనిఫిట్ మాత్రమే వర్తిస్తుంది. అదనంగా, అర్హత కలిగిన వినియోగదారులు రూ. 8వేల కార్పొరేట్ డిస్కౌంట్ లేదా రూ. 4వేల రూరల్ బెనిఫిట్‌ను కూడా పొందవచ్చు. ఇప్పటికే రెనో వాహనాలు కలిగి ఉన్నవారు లేదా రెఫరల్ ద్వారా కొనుగోలు చేసేవారు రూ. 3వేల అదనపు బోనస్‌ను పొందగలరు. రెనో కైగర్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 6.09 లక్షల నుండి ప్రారంభమై టాప్ వేరియంట్‌కు రూ. 11.22 లక్షల వరకు ఉన్నాయి. ఈ భారీ తగ్గింపు ఆఫర్ ఏప్రిల్ 2025 నెలాఖరు వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.
Also Read : తక్కువ ధరలో కొత్త లుక్ లో రెనాల్ట్ కైగర్.. మార్కెట్ కొల్లగొట్టడం ఖాయం
రెనో కైగర్ అత్యాధునిక ఫీచర్లతో నిండి ఉంది. ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లేతో కూడిన 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, LED హెడ్‌ల్యాంప్‌లు, స్టైలిష్ అల్లాయ్ వీల్స్, విశాలమైన హై సెంటర్ కన్సోల్ వంటివి ఉన్నాయి. సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ స్టార్ట్ అసిస్ట్ (HSA), ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి ముఖ్యమైన ఫీచర్లను ఈ కారు కలిగి ఉంది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన ఈ కాంపాక్ట్ SUV, డ్రైవర్, ముందు ప్రయాణీకుడితో సహా నలుగురు ఎయిర్‌బ్యాగ్‌లు, ప్రీటెన్షనర్లు, లోడ్ లిమిటర్‌లతో కూడిన సీట్ బెల్ట్‌లు, పిల్లల సీట్ల కోసం ISOFIX యాంకరేజ్‌లతో వస్తుంది.
రెనో కైగర్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లభిస్తుంది – ప్రపంచ స్థాయి 1.0-లీటర్ టర్బో పెట్రోల్, 1.0-లీటర్ ఎనర్జీ పెట్రోల్ ఇంజన్. ఇవి ఎక్స్-ట్రానిక్ CVT, 5-స్పీడ్ ఈజీ-ఆర్ AMT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉన్నాయి, ఇవి డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేస్తాయి. కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో అత్యంత సరసమైన ధరలో లభించే కార్లలో ఇది ఒకటి. దీని 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ లీటరుకు 20.62 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇప్పటికే కాంపాక్ట్ SUV కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నవారికి, రెనో కైగర్‌పై లభిస్తున్న ఈ భారీ తగ్గింపు ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. తక్కువ ధరలో మంచి ఫీచర్లు, భద్రత కలిగిన SUVని సొంతం చేసుకోవడానికి ఇది సరైన సమయం.
Also Read : నిస్సాన్ కిక్స్.. క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్..సేఫ్టీలో దుమ్మురేపిన ఎస్యూవీ !