RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మహాత్మా గాంధీ (న్యూ) సిరీస్‌లో రూ. 10, రూ. 500 నోట్లను కొత్తగా విడుదల చేయనుంది. ఈ నోట్లపై ఆర్‌బీఐ గవర్నర్(RBI governar) సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది. ఈ కొత్త నోట్లు ప్రస్తుతం అమలులో ఉన్న మహాత్మా గాంధీ (న్యూ) సిరీస్ నోట్ల డిజైన్‌ను పోలి ఉంటాయి, కానీ గవర్నర్ సంతకంతో తాజా అప్‌డేట్(Up date)గా విడుదల కానున్నాయి.
Also Read: హౌతీలపై అమెరికా దాడులు.. వీడియో విడుదల చేసిన ట్రంప్
కొత్త నోట్ల వివరాలు
రూ. 10 నోటు: ఈ నోటు చాక్లెట్ బ్రౌన్ రంగు(Chocolet Brown colour)లో ఉంటుంది. వెనుక భాగంలో ఒడిశాలోని కోనార్క్ సూర్య దేవాలయం చిత్రం ఉంటుంది. ఈ నోటు పరిమాణం 63 మి.మీ x 123 మి.మీ.
రూ. 500 నోటు: ఈ నోటు స్టోన్ గ్రే రంగు(Stone Gray colour)లో ఉంటుంది. వెనుక భాగంలో భారతీయ వారసత్వ స్థలమైన రెడ్ ఫోర్ట్ చిత్రం ఉంటుంది. దీని పరిమాణం 66 మి.మీ x 150 మి.మీ.
రెండు నోట్లలోనూ మహాత్మా గాంధీ(Mahatma Gandhi) చిత్రం, అశోక స్తంభ చిహ్నం, స్వచ్ఛ భారత్ లోగో వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉంటాయి. అదనంగా, దష్టి వైకల్యం ఉన్నవారి సౌలభ్యం కోసం బ్రెయిలీ ఫీచర్ కూడా ఉంటుంది.
పాత నోట్ల గురించి
ఆర్‌బీఐ స్పష్టం చేసిన ప్రకారం, గతంలో విడుదలైన రూ. 10,రూ. 500 నోట్లు ఇప్పటికీ చట్టబద్ధమైన టెండర్‌గా కొనసాగుతాయి. అంటే, కొత్త నోట్ల విడుదలతో పాత నోట్లు చెల్లుబాటు కాకుండా పోవు. ఈ కొత్త నోట్లు కేవలం గవర్నర్ సంతకంతో తాజా వెర్షన్‌గా మాత్రమే పరిగణించబడతాయి.
ఎందుకు కొత్త నోట్లు?
ఆర్‌బీఐ(RBI) గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా డిసెంబర్ 2024లో బాధ్యతలు స్వీకరించారు. ఆయన సంతకంతో నోట్లను విడుదల చేయడం ఒక సాంప్రదాయిక అప్‌డేట్‌గా భావించవచ్చు. అంతేకాక, కరెన్సీ సర్క్యులేషన్‌లో వైవిధ్యతను కొనసాగించడం, నకిలీ నోట్ల సమస్యను అరికట్టడం కోసం కొత్త డిజైన్ లేదా సంతకం అప్‌డేట్‌లు సాధారణంగా చేస్తారు.
ఈ కొత్త నోట్లు త్వరలోనే మార్కెట్‌లోకి రానున్నాయి. ఈ మార్పు సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా, ప్రస్తుత నోట్లతో పాటు సమాంతరంగా చలామణీలో ఉంటాయి.