Homeబిజినెస్Renault Duster mileage: డస్టర్ మైలేజ్ పై క్లారిటీ ఇచ్చిన రెనాల్ట్.. ఇక అనుమానాలన్నీ మాయం..

Renault Duster mileage: డస్టర్ మైలేజ్ పై క్లారిటీ ఇచ్చిన రెనాల్ట్.. ఇక అనుమానాలన్నీ మాయం..

Renault Duster mileage: ఈరోజుల్లో SUV వెహికల్ కావాలని కోరుకునేవారు చాలా మందే ఉన్నారు. విశాలమైన స్పేస్ తో పాటు లాంగ్ డ్రైవ్ చేయడానికి అనువైన క్యాబిన్ ఈ వేరియంట్ కారులో ఉంటుంది. అయితే SUV సెగ్మెంట్ లో మొట్టమొదటి కారుగా నిలిచి అందరి మనసు దోచుకున్న Renault డస్టర్ కారు ఇటీవల తిరిగి మార్కెట్లోకి వచ్చిన విషయం తెలిసిందే. నేటి వినియోగదారులను ఇంపెస్ చేసే విధంగా ఇందులో ఫీచర్స్, ఇంజన్ పనితీరు ఉన్నట్లు ఇప్పటికే కంపెనీ […]

Renault Duster mileage: ఈరోజుల్లో SUV వెహికల్ కావాలని కోరుకునేవారు చాలా మందే ఉన్నారు. విశాలమైన స్పేస్ తో పాటు లాంగ్ డ్రైవ్ చేయడానికి అనువైన క్యాబిన్ ఈ వేరియంట్ కారులో ఉంటుంది. అయితే SUV సెగ్మెంట్ లో మొట్టమొదటి కారుగా నిలిచి అందరి మనసు దోచుకున్న Renault డస్టర్ కారు ఇటీవల తిరిగి మార్కెట్లోకి వచ్చిన విషయం తెలిసిందే. నేటి వినియోగదారులను ఇంపెస్ చేసే విధంగా ఇందులో ఫీచర్స్, ఇంజన్ పనితీరు ఉన్నట్లు ఇప్పటికే కంపెనీ ప్రకటించింది. అయితే ఈ కారు మైలేజ్ పై చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఈ ఇంజన్ మైలేజ్ ఎంత వస్తుంది? ఇది రోజూవారి వినియోగదారులకు అనుగుణంగా ఉంటుందా? అని చాలా మంది చర్చించుకున్నారు. దీనిపై తాజాగా కంపెనీ మైలేజ్ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. ఇంతకీ ఈ కారు మైలేజ్ ఎంత ఉందంటే?

మార్చి 17న మార్కెట్లోకి వచ్చిన రెనాల్ట్ కొత్త డస్టర్ కారు పాత దాని కంటే కొత్త డిజైన్ ను కలిగి ఉంది. ఈ కారుకు మరింత అందాన్ని ఇచ్చే LED హెడ్ ల్యాంప్స్ ను తీర్చిదిద్దారు. బంఫర్ క్లాడింగ్, వెనుకవైపు LED టెయిల్ ల్యాంప్స్ సమాంతరంగా ఉండడంతో ప్రీమియం లుక్ తో కనిపిస్తుంది. 18 అంగుళాల అలాయ్ వీల్స్, రూప్ రైల్స్ ఉండడంతో లాంగ్ డ్రైవ్ చేసేవారికి అనుగుణంగా ఉంటుంది.

ఈ కారు ఇంటీరియర్ లో లేటేస్ట్ టెక్నాలజీతో కూడిన ఫీచర్లు ఉన్నాయి. 10.1 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో కూడిన డిస్ ప్లే కనిపిస్తాయి. నేటితరం వారు ఎక్కువగా కోరుకునే పనోరమిక్ సన్ రూఫ్ తో పాటు సేప్టీ కోసం ఎయిర్ బ్యాగ్స్, ADAS ఫీచర్లు ఉన్నాయి. 518 లీటరల్ బూట్ స్పేస్ ఉండడంతో లాంగ్ డ్రైవ్ కు అనుగుణంగా ఉంటుంది. అలాగే ఇందులో 212 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఉండడంతో స్మూత్ డ్రైవ్ చేసుకోవచ్చు.

కొత్త డస్టర్ లో 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ను అమర్చారు. ఇది 163 bhp పవర్ తో పాటు 280 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ తో పాటు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. ARAI సర్టిఫైడ్ తో ఇంజన్ సామర్థ్యం కోరుకునేవారికి ఇది బెస్ట్ ఎంపిక అని అంటున్నారు. అయితే ఈ ఇంజన్ పై మైలైజ్ విషయంలో చాలా మందికి అనుమానాలు ఉండేవి. కానీ ఇటీవల కంపెనీ తెలిపిన ప్రకారం లీటర్ ఇంధనానికి 18.45 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. మిడ్ సైస్ SUV విభాగంలో ఇలాంటి మైలేజ్ ఇవ్వడంపై చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం ఈ కారును రూ.10.49 లక్షల ప్రారంభ ధర నుంచి రూ. 18.72 లక్షల వరకు విక్రయిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper