https://oktelugu.com/

సీనియర్ సిటిజన్లకు నెలనెలా ఆదాయం ఇచ్చే పథకాలు ఇవే..?

సీనియర్ సిటిజన్లకు వయస్సు రిత్యా రిస్క్ తీసుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. జీతం ద్వారా ఆదాయం ఉండదు కాబట్టి సీనియర్ సిటిజన్లు క్రమమైన ఆదాయం వచ్చే ఏర్పాట్లను చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. పెట్టుబడులకు భద్రత కల్పించడంతో పాటు రాబడిపై దృష్టి పెడితే ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. తక్కువ రిస్క్ తో కూడిన పెట్టుబడులను సీనియర్ సిటిజన్లు ఎంచుకుంటే మంచిది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఐదు సంవత్సరాల కాలపరిమితితో ఏకంగా 15 లక్షల రూపాయలు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : July 6, 2021 6:04 am
    Follow us on

    సీనియర్ సిటిజన్లకు వయస్సు రిత్యా రిస్క్ తీసుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. జీతం ద్వారా ఆదాయం ఉండదు కాబట్టి సీనియర్ సిటిజన్లు క్రమమైన ఆదాయం వచ్చే ఏర్పాట్లను చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. పెట్టుబడులకు భద్రత కల్పించడంతో పాటు రాబడిపై దృష్టి పెడితే ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. తక్కువ రిస్క్ తో కూడిన పెట్టుబడులను సీనియర్ సిటిజన్లు ఎంచుకుంటే మంచిది.

    సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఐదు సంవత్సరాల కాలపరిమితితో ఏకంగా 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేయవచ్చు. ఈ స్కీమ్ పై 7.40 శాతం వడ్డీ కాగా మూడు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. సీనియర్ సిటిజన్లు ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో లక్షన్నర రూపాయల వరకు పన్ను మినహాయింపును పొందే అవకాశం అయితే ఉంటుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు పోస్టాఫీసుల్లో ఈ పథకం అమలులో ఉంటుంది.

    సీనియర్ సిటిజన్లకు ప్రధానమంత్రి వయో వందన యోజన స్కీమ్ కూడా బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు. లక్షన్నర రూపాయల నుంచి 15 లక్షల రూపాయల వరకు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. 10 సంవత్సరాల కాలపరిమితి ఉన్న ఈ స్కీమ్ లో 1,000 రూపాయల నుంచి 9,250 రూపాయల వరకు ఫించను పొందే అవకాశం ఉంటుంది. ఎల్.ఐ.సీ ఇండియా నుంచి ఈ స్కీమ్ ను తీసుకోవచ్చు. 15 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ బాండ్లలో మదుపు చేయవచ్చు.

    ఈ స్కీమ్ లో ఆరు నెలలకు ఒకసారి వడ్డీ లభిస్తుంది. పోస్టల్ నేషన్ సేవింగ్స్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లక్షన్నర రూపాయల వరకు పన్ను ఆదా చేసే అవకాశం ఉంటుంది. తక్కువ ఆదాయం ఉన్న యాన్యుటీ ప్లాన్లకు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు, క్రమ ఆదాయం లేని పథకాలకు సీనియర్ సిటిజన్లు దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు.