https://oktelugu.com/

Real Estate : పదేళ్ల తరువాత రియల్ ఎస్టేట్ లో ఉండే మార్పులు ఇవే..

2028 సంవత్సరానికి పట్టణ జనాభా 50 శాతానికి చేరుుకుంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి వాటికి వలసలు పెరుగుతాయి. సిటీకి వచ్చే వారి ఆదాయం పెరుగుతుంది. ఇది 2020 నాటికి 29 మిలియన్లకు చేరుకుంటుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : April 20, 2024 / 04:47 PM IST

    Real-estate-hyderbaad

    Follow us on

    Real Estate :  ఇప్పుడున్న సమయం.. రేపు ఉండదు.. రేపటి గురించి ఎవరికీ తెలియదు.. కానీ మారుతున్న కొన్ని పరిస్థితులను బట్టి అభివృద్ధిపై అంచనా వేయచ్చు. ముఖ్యంగా నిర్మాణాల విషయంలో గణనీయమైన పెరుగుదల ఉండొచ్చు. రియల్ ఎస్టేట్ రంగం ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. ప్రతీ ఒక్కరూ సొంత ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటారు. ఆదాయం ఎలా ఉన్నా సొంత గూడు కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయిస్తారు. దీంతో నిర్మాణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఇలా పదేళ్లు అయ్యేసరికి ఎలా ఉంటుంది? ‘నైట్ ఫ్రాంక్ ఇండియా -సీఐఐ’ ఇటీవల పదేళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక అంచనాకు వచ్చింది. దాని వివరాల్లోకి వెళితే..

    పట్టణాల్లో, నగరాల్లో ఇటీవల నిర్మాణాలు పుంజుకున్నాయి. ఇండిపెండెంట్ హౌజ్ లతో పాటు అపార్టుమెంట్ల కొత్తగా వెలుస్తున్నాయి. వీటి సంఖ్య పదేళ్లలో అంటే 2024 నుంచి 2034 వరకు 7.8 కోట్లకు చేరుకుంటుందని తెలిపింది. వచ్చే పదేళ్లలో దేశ జనాభా 42.5 శాతం అధికంగా నమోదు కానుంది. ఈ జనాభాకు అనుగుణంగా నిర్మాణాలు పెరిగే అవకాశం ఉంది. ఉపాధి, వ్యాపారం కోసం పట్టణాలకు వచ్చే వారి సంఖ్య పెరుగుతుంది. దీంతో వారు సొంత ఇల్లు కావాలని కోరుకుంటారు. ఈ క్రమంలో రియల్ రంగం పుంజుకుంటుంది.

    2028 సంవత్సరానికి పట్టణ జనాభా 50 శాతానికి చేరుుకుంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి వాటికి వలసలు పెరుగుతాయి. సిటీకి వచ్చే వారి ఆదాయం పెరుగుతుంది. ఇది 2020 నాటికి 29 మిలియన్లకు చేరుకుంటుంది. ఆదాయం పెరిగే కొద్దీ నిర్మాణాలు వేగంగా పుంజుకోనున్నాయి. హైదరాబాద్ లో ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఖాళీ స్థలాల్లో విల్లా ప్రాజెక్టులు, విద్యాసంస్థలు, వాణిజ్య కేంద్రాలు, ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ లు ఏర్పడుతాయి. పదేళ్ల తరువాత ధరల్లోనూ మార్పులు వచ్చే అవకాశం ఉంది. కొందరు సరసమైన ధరల్లో ఇళ్లు కట్టించి విక్రయించే అవకాశం ఉంది.

    ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ మెంట్లు పెరుగుతాయి. తక్కువ మొత్తంలో ఎక్కువ లాభాలు రాబట్టేందు కొందరు తీవ్రంగా కృష్టి చేరస్తారు. ప్రస్తుతం ఇండియన్ రీట్స్ పోర్ట్ పొలియో 100.7 మిలియన్ చదరపు అడుగులు కలిగి ఉంది. ఇందలుో 91.1 మిల్లీ చదరపు అడుగులు కార్యాలయాలకే పరిమితం అయింది. రిటైల్ లో 9.6 మిల్లీ చదరపు అడుగులగా ఉంది. మున్ముందు వడ్డీ రేట్లు తక్కువ కూడా కావడంతో ఈ రంగంలో పెట్టుబుడలు పెరుగుతాయి.