Rawalpindi: కొన్ని ఘటనలు చూస్తే నిజంగా ఇది సాధ్యమేనా? ఇలా జరుగుతుంటుందా అని అనిపిస్తుంది. కొన్నిసార్లు నమ్మకం కూడా కలగదు. అయితే ఎక్కువ శాతం ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు పిల్లలు జన్మిస్తారు. కవలలు జన్మిస్తే పలానా వారికి కవలలు జన్మించారట అని మాట్లాడుకుంటారు. ఇక ముగ్గురు పుడితే మరింత షాక్ అవుతారు. కానీ నలుగురు, ఐదుగురు అనే మాట వింటే వామ్మో ఇదెలా సాధ్యం అని ముక్కున వేలు వేసుకుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటన వింటే మరింత షాక్ లో ఉంటారు.
మరి ఈ షాకింగ్ న్యూస్ చదవడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే చదివేసేయండి. ఈ సంఘటన ఎక్కడో కాదు మన పక్క దేశం పాకిస్థాన్ లో చోటు చేసుకుంది. సాధారణంగా ఒకే కాన్పులో కవలలు జన్మిస్తారు కానీ ఇక్కడ మాత్రం ఒకే కాన్పులో ఆరుగురు జన్మించారు. రావల్పిండి కి చెందిన జీనత్ వాహిద్ అనే మహిళ ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ సంఘటనను చూసి డాక్టర్లు సైతం విస్తు పోయారట.
నవజాత శిశువుల్లో నలుగురు మగ, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారట. ఇక తల్లి బిడ్డలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిపారు వైద్యులు. శిశువుల శరీర బరువు కూడా సాధారణంగానే ఉందని తెలిపారు. అయితే సెక్స్ టప్లెట్స్ వివిధ రకాలుగా ఉంటాయి. ఆరు వేర్వేరు అండాలు, స్పెర్మ్ కలయిక నుంచి వచ్చేవి ఒక రకంగా ఉంటే ఒకే ఫలధీకరణ అండం ఎన్నో పిండాలుగా విడిపోయినప్పుడు వచ్చే సెక్స్ టప్లెట్స్ మరో రకానికి చెందినవి గా ఉంటాయని తెలిపారు వైద్యులు. అయితే ఇలాంటివి చాలా రేర్ గా జరుగుతుంటాయట.
ఇదిలా ఉంటే ఒకరిని పోషించడం వారి బాగోగులు చూసుకోవడమే చాలా కష్టంగా ఉన్న ఈ సందర్భంలో ఆరుగురు పిల్లలను చూసుకోవడం అంటే ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. కానీ పిల్లల మీద తల్లికి ఉండే ఆ ప్రేమ ముందు ఈ కష్టం చిన్నదే అవుతుంది. ముసిముసి నవ్వుల ఆ పిల్లలను చూస్తూ తల్లి ఎంతటి కష్టాన్ని అయినా మర్చిపోతుంది. కానీ ఈ తల్లి పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుకుందాం..