Raptee HV T30: భారతదేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ హవా పెరిగిపోతుంది. పెట్రోల్ ధరలతో పాటు కాలుష్య రహిత వాహనాలను వినియోగించాలని అవగాహన పెరగడంతో చాలామంది ఈవీల వైపు చూస్తున్నారు. అయితే నేటి తరం లగ్జరీ వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ద్విచక్ర వాహనాల్లో కొత్త టెక్నాలజీని అమరుస్తున్నారు. కారులో ఉపయోగించే సాంకేతికాన్ని ఇందులో చేర్చడంతో అచ్చం కారు వలె దూసుకుపోతుంది. అయితే ధర కాస్త ఎక్కువగా ఉన్నా సరే.. స్టైలిష్ లుక్ తో పాటు ఫీచర్స్ లైక్ చేసేవారు ఇలాంటి బైక్స్ ను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా కొత్త కంపెనీ Raptee నుంచి HV T30 అనే బైక్ ను ప్రారంభించి కస్టమర్ల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Raptee HV T30 అనే బైక్ను ఇప్పటికే చెన్నై నగరంలో రిలీజ్ చేశారు. పూర్తిగా ఎలక్ట్రిక్ వేరియంట్ అయిన దీనిని ఏడు సంవత్సరాల పాటు పరిశోధన చేసినట్లు కంపెనీ తెలుపుతుంది. అయితే దీని ధర రూ.2.39 లక్షలు గా నిర్ణయించారు. అయినప్పటికీ ఈ బైక్ ప్రారంభంలోనే 8000 బుకింగ్లు నమోదు చేసుకుంది. ప్రీమియం బైక్ కోసం చూసేవారికి ఇది బాగా నచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ బైక్ లో ఎలక్ట్రిక్ కార్లకు ఉపయోగించే CCS2 కలెక్టర్ ద్వారా చార్జింగ్ చేసుకోవచ్చు. ఇది పబ్లిక్ DC ద్వారా లభ్యం అవుతుంది. ఈ చార్జింగ్ ద్వారా కేవలం 36 నిమిషాల్లోనే 80% వరకు చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో ఉండే బ్యాటరీ అందుకు అనుగుణంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఈ వాహనంలో 5.4 kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీని ఉంచారు. ఇది ఒకసారి చార్జింగ్ అయితే 200 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తున్నట్లు కంపెనీ తెలుపుతుంది. ఈ ఇంజన్ 29.5 బిహెచ్పి పవర్ తో పాటు 70 NM టార్క్ రిలీజ్ చేయనుంది. రోజువారి వినియోగదారులతో పాటు స్టైలిష్ కోసం బైక్ కొనేవారికి.. అలాగే లాంగ్ జర్నీ చేసే వారికి కూడా ఈ ఇంజన్ బాగా ఉపయోగపడుతుంది.
ఈ బైక్ గురించి ప్రధానంగా చెప్పుకోవాల్సింది డిజైన్. చూడగానే ఆకట్టుకునేలా ఉండే దీనికి LED హెడ్ లాంప్స్, LED టెయిల్ లైట్స్ పూర్తిగా ప్రీమియం లుక్ ను అందిస్తాయి. అలాగే వేగం, ఇంజన్ పనితీరుపై పూర్తిగా సమాచారం అందించే బిగ్ డిస్ప్లే కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. మొత్తంగా ఈ బైక్ ధర ఎక్కువగా ఉన్నప్పటికీ.. ప్రీమియం కస్టమర్స్ కు అనుగుణంగా ఉంటుందని తెలుస్తోంది.