https://oktelugu.com/

Premium Car : తక్కువ ధరకే ఫ్రీమియం కారు కొనాలనుకుంటున్నారా? ఇవి మీకోసమే…

ప్రీమియం కారు కొనాలని చాలా మందికి ఉంటుంది. కానీ ధరను చూసి వెనుకడుగు వేస్తారు. కొన్ని కంపెనీలు తక్కువ బడ్జెట్ ల ప్రీమియం కార్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : February 5, 2024 / 01:59 PM IST

    Prmium car Low Budjet

    Follow us on

    Premium Car : కారు కొనేవారి అభిరుచి భిన్నంగా ఉంటుంది. కొందరు హ్యాచ్ బ్యాక్ కార్లకు ప్రిఫరెన్స్ ఇస్తే..మరికొందరు ఎస్ యూవీల వైపు చూస్తారు. ఇంకొందరు 7 సీటర్ పై మనసు పెడుతారు. అయితే ప్రీమియం కారు కొనాలని చాలా మందికి ఉంటుంది. కానీ ధరను చూసి వెనుకడుగు వేస్తారు. కొన్ని కంపెనీలు తక్కువ బడ్జెట్ ల ప్రీమియం కార్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇవి రూ.8 లక్షల లోపే ఉండడం విశేషం. ఈ తరుణంలో ప్రీమియం కార్ల గురించి వేచి చూసేవారికి ఇవి బెస్ట్ కార్లు అని చెప్పవచ్చు.

    దేశంలో అత్యధిక కార్ల విక్రయాలు జరిపే మారుతి నుంచి ఎన్నో మోడళ్లు రిలీజ్ అయ్యాయి. ఈ కంపెనీ నుంచి వచ్చిన ఫ్రాంక్స్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కారుగా నిలుస్తుంది. ఈ కారు రూ.7.47 లక్షల ప్రారంభం నుంచి రూ.13.14 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఇది 1.0, 1.2 లీటర్ పెట్రోల్ రెండు ఇంజిన్లు కలిగి 20,09 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఇదే కంపెనీకి చెందిన బాలెనో సైతం రూ.6.61 లక్షల ప్రారంభ ధరతో ప్రారంభమై రూ.9.88 లక్షల వరకు అమ్ముడవుతోంది. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. దీని మైలేజ్ 22.94 కిలోమీటర్ల వరకు ఉంది.

    మారుతి కంపెనీకి ఇటీవల టాటా గట్టి పోటీ ఇస్తుంది. మారుతి నుంచి వచ్చే ప్రతీ కారును ప్రత్యామ్నాయంగా తీసుకొస్తుంది. ప్రీమియం కార్లను కూడా మారుతి లాగే రోడ్లపై తిప్పుతోంది. ఈ కంపెనీ నుంచి పంచ్ ఆకట్టుకుంటుంది. దీనిని రూ.6.0 లక్షల ప్రారంభం నుంచి రూ.9.95 లక్షల వరకు విక్రయిస్తున్నారు. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో కూడిన ఈ కారు 20.09 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. నిస్సాన్ కంపెనీకి చెందిన మాగ్నౌైట్ కారు ఆకర్షిస్తోంది. ఇది 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో నడుస్తుంది. ఇది రూ.6 లక్షల ప్రారంభం నుంచి రూ.10 లక్షల వరకు విక్రయిస్తున్నారు. మాగ్నైట్ లీటర్ కు 20 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

    ఇంజిన్, డిజైన్ తో కూడిన ఈ కార్లు తక్కువ ధరకే వస్తుండడంతో వినియోగదారులు ఎక్కువగా వీటిపై ఫోకస్ పెడుతున్నారు. మొన్నటి వరకు మారుతి వ్యాగన్ ఆర్ ప్రీమియం కారుగా భావించారు. కానీ దీని కంటే ఎక్కువ ఫీచర్లు పై కార్లు ఇవ్వడంతో వినియోగదారులు వాటిపై ఇంట్రెస్టు పెడుతున్నారు.