Devara Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ జనరేషన్ లో ఉన్న హీరోలలో ఎలాంటి పాత్రనైనా అలవోకగా చేసి మెప్పించగలిగే సత్తా ఉన్న ఒకే ఒక నటుడు జూనియర్ ఎన్టీఆర్. ఈయన ఇప్పటి వరకు చేసిన ప్రతి క్యారెక్టర్ కి 100% న్యాయం చేస్తూ సక్సెస్ అవుతునే ఉన్నాడు.ఇక ఇలాంటి క్రమంలో ఈయన ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో దేవర అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించిన గ్లింమ్స్ గత నెలలో రిలీజ్ చేశారు.ప్రతి ప్రేక్షకుడికి కూడా గుస్ బమ్స్ వచ్చాయనే చెప్పాలి. ఇక ఈ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియాలో మరోసారి తన సత్తా చాటాబోతున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలో ఈ సినిమా క్లైమాక్స్ విషయం లో సినిమా యూనిట్ కొంత ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. అసలు మ్యాటరెంటంటే ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ లో ఇప్పుడు కొన్ని మార్పులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇంతకుముందు ఉన్న క్లైమాక్స్ కొంచెం వీక్ గా అనిపించడంతో సినిమా యూనిట్ మరొకసారి ఆ క్లైమాక్స్ ని మార్చి రీ షూట్ చేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో దేవర సినిమాకి క్లైమాక్స్ ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? అనే అభిప్రాయంలో కూడా ప్రేక్షకులు ఉన్నారు. అయితే ఈ సినిమా రెండు పార్టులు గా వస్తుంది. కాబట్టి క్లైమాక్స్ సెట్ కావడం లేదు అనే ఉద్దేశ్యం తో మరొకసారి చేంజ్ చేసి షూట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
బాహుబలి సినిమాలో కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు అనే పాయింట్ ను తెరపైకి తెస్తూ మొదటి పార్ట్ కి ఎండ్ కార్డు వేశారు. దానివల్ల సెకండ్ పార్టు మీద అందరిలో విపరీతమైన ఆసక్తి నెలకొంది. అలాగే దేవర సినిమాలో కూడా అలాంటి ఒక ట్విస్ట్ ఇచ్చి ఫస్ట్ పార్ట్ ని ఎండ్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను అలరిస్తుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…