https://oktelugu.com/

Kia :కియా 7 సీటర్ కారు గురించి తెలిస్తే దిమ్మదిరుగుద్ది.. ఆ ఫీచర్స్ ఏంటి సామి..

ఇప్పటి వరకు మారుతి నుంచి ఎర్టీగా.. టాటా సఫారీ, టయోటా ఇన్నోవా క్రిస్టాలు అలరించాయి. అయితే కియా కొత్తగా 7 సీటర్ ను

Written By:
  • Srinivas
  • , Updated On : February 5, 2024 / 02:02 PM IST

    Kia 7 seater car

    Follow us on

    Kia :నేటి కాలంలో కారు కొనుగోలు చేయాలనుకునే వారు ప్రతీ అవసరం తీరాలనుకుంటున్నారు. ఓ వైపు కార్యాలయాలకు వెళ్లడమే కాకుండా కుటుంబం మొత్తం కలిసి ప్రయాణించడానికి అనువుగా ఉండేలా చూస్తున్నారు. ఈ క్రమంలో 7 సీటర్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఒకప్పుడు 7 సీటర్ కార్లపై ఎక్కువగా దృష్టి పెట్టేవారు కాదు. కాని వినియోగదారుల అభిరుచులు మారుతుండడంతో కంపెనీలు వీటి ఉత్పత్తిపై ఫోకస్ పెట్టాయి. ఇప్పటి వరకు మారుతి నుంచి ఎర్టీగా.. టాటా సఫారీ, టయోటా ఇన్నోవా క్రిస్టాలు అలరించాయి. అయితే కియా కొత్తగా 7 సీటర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ఫీచర్లు చూసి దిమ్మదిరిగిందని అంటున్నారు. అలాగే ఇది ధర తక్కువగానూ ఉండడంతో దీనిపై ఆసక్తి చర్చ సాగుతోంది. ఇంతకీ ఆ కారు ఎలా ఉందంటే?

    దేశంలో కియా హవా పెరిగిపోతుంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయింది తక్కువ కార్లే అయినా అవి వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా కియా నుంచి రిలీజ్ అయిన కేరేన్స్ ఆకట్టుకుంటోంది. ఎంపీవీ సెగ్మెంట్ లో రిలీజ్ అయిన ఇది స్టైలిస్ గా ఉండి ఇంప్రెస్ చేస్తుంది. Kia Carens గురించి వివరాల్లోకి వెళితే.. ఇది 1.5 లీటర్ పెట్రోల్, 1.5 టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ అనే మూడు ఇంజిన్లను కలిగి ఉంది.

    1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కు 115 బీహెచ్ పీ పవర్, 114 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తూ 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. 1.5 టర్బో పెట్రోల్ 160 బీహెచ్ పీ పవర్, 253 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 115 బీహెచ్ పీ పవర్, 250 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది.

    ఆకర్షణీయమైన లుక్ తో పాటు ఇన్నర్ స్పేస్ కలిగిన కేరెన్స్ 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో పాటు డిజిటల్ ఇనిస్ట్రుమెంట్ క్లస్టర్, క్రూయిజ్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, రెండో వరుస సీట్లలో ఎలక్ట్రిక్ వన్ టచ్ ఫోల్డింగ్ సిస్టమ్ ను కలిగి ఉంది.
    7 సీటర్ అనగానే తక్కువ స్పేస్ తో ఇరుకుగా ఉంటుందని అభిప్రాయం. కానీ కియా నుంచి రిలీజ్అయిన ఈ కారు ఇన్నర్ స్పేస్ 216 లీటర్ల బూట్ స్పేస్ ను కలిగి ఉంది. ఈ కారు రూ.10.45 లక్షల ప్రారంభ ధర నుంచి 18.90 లక్షల వరకు విక్రయిస్తున్నారు.