
టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం కోసం భారత పురుషుల హాకీ జట్టు జర్మనీతో పోరాడుతోంది. గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన మ్యాచ్ లో రెండో క్వార్టర్ ముగిసే సరికి జర్మనీ, ఇండియా 1-1 గోల్స్ తో సమానంగా ఉన్నాయి. అయితే జర్మనీ వరుసగా రెండు గోల్స్ కొట్టి 3-1 తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే, వెంటనే భారత్ సైతం రెండు గోల్స్ కొట్టి 3-3 సమానంగా నిలిచింది.