https://oktelugu.com/

Personal Loan: పర్సనల్ లోన్ కావాలా? ఈ బ్యాంకులో అతి తక్కువ వడ్డీ రేటు..

కొన్ని బ్యాంకులు ఎక్కు వ వడ్డీ విధిస్తుండగా..కొన్ని మాత్రం వినియోగదారుల ఆర్థిక లావాదేవీల ఆధారంగా తక్కువ వడ్డీకే లోన్లు ఇస్తున్నాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : March 15, 2024 10:00 am
    Follow us on

    ersonal Loan: కొన్ని అవసరాల కోసం సరైన సమయంలో డబ్బు దొరకదు. ఇలాంటి సమయంలో వేరొకరి వద్ద అప్పుగా డబ్బు అడుగుతాం.. కానీ నేటి కాలంలో అప్పు ఇచ్చే వారు తక్కువయ్యారు. దీంతో చాలా మంది బ్యాంకు ద్వారా రుణాలు తీసుకుంటారు. ఉద్యోగులు, వ్యాపారస్తులు ఎక్కువ శాతం ఇతరుల వద్ద అప్పుడ తీసుకోవడం కంటే లోన్లు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ పెడుతారు. అయితే కొన్ని బ్యాంకులు ఎక్కు వ వడ్డీ విధిస్తుండగా..కొన్ని మాత్రం వినియోగదారుల ఆర్థిక లావాదేవీల ఆధారంగా తక్కువ వడ్డీకే లోన్లు ఇస్తున్నాయి. ముఖ్యంగా వ్యక్తిగత రుణాల విషయంలో అతి తక్కువ వడ్డీతో ఇచ్చే కొన్ని బ్యాంకులు ఉన్నాయి. వాటి వివరాల్లోకి వెళితే..

    బ్యాంకు ద్వారా రుణాలు తీసుకోవాలనుకునేవారు ఏ బ్యాంకు ఎంత వడ్డీ విధిస్తుందో కొందరు ముందే తెలుసుకుంటారు. కానీ చాలా మంది వీటి గురించి పట్టించుకోకుండా లోన్లు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో చాలా వరకు నష్టపోతుంటారు. ప్రముఖ ఐసీఐసీఐ బ్యాంకు వ్యక్తిగత రుణంపై 10.65 శాతం వడ్డీరేటుతో రుణాలు అందిస్తోంది. అయితే ఒక్కోసారి ఇది 24 శాతం వరకు వసూలు చేసే అవకాశం ఉంది. మరో ప్రముఖ బ్యాంకు హెచ్ డీఎఫ్ సీ పర్సనల్ లోన్ పై 10.75 శాతం వడ్డీ రేటుతో రుణాలు మంజూరు చేస్తుంది. అయితే ఈ వడ్డీ రేటు సిబిల్ స్కోర్ ఆధారంగా విధిస్తారు.

    దేశంలో ఇప్పుడిప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంటున్న బ్యాంకు కోటక్ మహీంద్రా. ఈ బ్యాంకు ఖాతాదారులు ఆర్థిక వ్యవహారాల ఆధారంగా రుణాలను మంజూరు చేస్తుంది. ఈ బ్యాంకు నుంచి రూ. రుణాలు తీసుకునేవారికి 10.99 శాతం వడ్డీని వధిస్తారు. ప్రముఖ పంజాబ్ నేషనల్ బ్యాంకు వారు 12.75 శాతం నుంచి 17.25 శాతం వరకు వడ్డీ విధిస్తారు. ఈ వడ్డీ రేటు సిబిల్ స్కోరుపై ఆధారపడుతుంది. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వ్యక్తిగత లోన్లు రూ.20 లక్షల వరకు అందిస్తాయి. వీటిపై రూ.11.15 శాతం వడ్డీని విధిస్తారు.

    మిగతా లోన్ల కంటే వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు భిన్నంగా ఉన్నా.. ఇవి తక్షణమే మంజూరు అవుతాయి. కొన్ని బ్యాంకులు మాత్రం మినిమం డాక్యుమెంటేషన్ కోరుతుంది. ఏ బ్యాంకు అయినా ఖాతాదారుల సిబిల్ స్కోరు ఆధారపడే లోన్లు ఇస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ నేపథ్యంలో లోన్లు తీసుకున్నా.. ఎక్కడా మిస్ కాకుండా రెగ్యులర్ గా పే చేస్తే ముందు ముందు లోన్ పరిమితిపెరిగే అవకాశం ఉంది.