Bollywood Actresses: మనదేశంలో క్రికెటర్లకు, సినిమా స్టార్లకు ఉన్నంత క్రేజ్ అంతా ఇంతా కాదు. క్రికెట్ ను, సినిమాలను భారతీయులు రెండు మతాలుగా పాటిస్తారు అంటే అతిశయోక్తి కాదు. అంతటి ఫాలోయింగ్ ఉన్న సినిమా, క్రికెట్ ఒకే చోట చేరితే ఎలా ఉంటుంది.. అంతకంటే గొప్పదనం మరేం ఉంటుంది.. క్రికెటర్స్, సినీ నటుల ప్రేమలో పడటం కొత్తేమీ కాదు. డేటింగ్ చేయడం వింతేమీ కాదు. 80 ల కాలంలోనే సినీనటులు, క్రికెటర్లు ప్రేమలో పడి తమ బంధాన్ని పెళ్లి దాకా తీసుకెళ్లారు. ఇక తర్వాత కాలంలో ఇలాంటి పెళ్లిళ్లు చాలా జరిగాయి.. అలా ఒకటైన క్రికెటర్లు, సినిమా తారలను ఒకసారి పరిశీలిస్తే..
షర్మిల ఠాగూర్, మన్సూర్ అలీ ఖాన్ పటౌడి
షర్మిల ఠాగూర్, మన్సూర్ అలీ ఖాన్.. వివాహం ఆ రోజుల్లోనే ట్రెండ్ సెట్టర్. వీరి వివాహం 1969 లో జరిగింది. అప్పట్లో షర్మిల సినిమా తారగా ఉండేవారు. మన్సూర్ క్రికెటర్ గా ఉండేవారు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి సంతానమే సైఫ్ అలీఖాన్, సోహ అలీ ఖాన్. సైఫ్, సోహా బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించారు. సైఫ్ అలీ ఖాన్ ప్రముఖ సినీనటి కరీనాకపూర్ ను రెండో వివాహం చేసుకున్నారు.
సంగీత బిజ్లానీ, అజారుద్దీన్
ఇండియన్ క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు అజారుద్దీన్. 1996లో మిస్ ఇండియా, హిందీ నటి సంగీతను వివాహం చేసుకున్నాడు. అప్పట్లో వీరి వివాహం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
సాగరిక- జహీర్ ఖాన్
ఇండియన్ పేసుగుర్రం గా జహీర్ ఖాన్ పేరు తెచ్చుకున్నాడు. అతడు సినిమా నటి సాగరికతో ప్రేమలో పడ్డాడు. కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత.. వీరిద్దరూ 2017లో పెళ్లి చేసుకున్నారు
గీతా బస్రా, హర్భజన్ సింగ్
హర్భజన్ సింగ్ ఇండియన్ స్పిన్ బౌలింగ్ కొత్త అర్ధాన్ని తీసుకొచ్చాడు. దూస్రా బౌలింగ్ తో సరికొత్త అస్త్రాన్ని బ్యాటర్ల మీద సంధించాడు.. అలాంటి ఈ ఆటగాడు బాలీవుడ్ నటి గీతకు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వీరిద్దరూ ఐదు సంవత్సరాల పాటు డేటింగ్ లో ఉన్నారు. అనంతరం 2015లో పెళ్లి చేసుకున్నారు.
హేజల్ కీచ్, యువరాజ్ సింగ్
కెరియర్ సూపర్ స్పీడ్ గా ఉన్నప్పుడే యువరాజ్ క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డాడు. అమెరికాలో చికిత్స తీసుకున్నాడు. ఆ తర్వాత అతడికి హేజల్ పరిచయమైంది. వీరిద్దరికి 2016లో వివాహం జరిగింది. సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ సినిమాలో హేజల్ ఒక పాత్రలో కనిపించింది.
రీనా, మొహసిన్
బాలీవుడ్ నటి రీనా రాయ్, పాకిస్తాన్ క్రికెటర్ మొహసిన్ ఖాన్ కొన్నాళ్లపాటు ప్రేమించుకున్నారు. వివాహ బంధం ద్వారా ఒకటయ్యారు. అనంతరం విడాకులు తీసుకున్నారు.
నటాషా- హార్దిక్ పాండ్యా
మోడల్ గా ఉన్న నటాషా జీవితం హార్దిక్ రాకతోనే తారాస్థాయికి ఎదిగింది. వీరిద్దరూ నిశ్చితార్థం అనంతరం ఒక మగ బిడ్డకు జన్మనిచ్చారు.
అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ
టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ.. క్రికెట్లో అప్పుడప్పుడే పేరు తెచ్చుకుంటున్న సమయంలోనే బాలీవుడ్ నటి అనుష్క శర్మను ప్రేమించాడు. ఇద్దరు ప్రేమలో పడిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే వాటన్నింటినీ అధిగమించి వారిద్దరు 2017లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.
అతియా శెట్టి, కేఎల్ రాహుల్
అతియా శెట్టి నటుడు సునీల్ శెట్టి కుమార్తె. ఈమె టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ తో ప్రేమలో పడింది. కొంతకాలం ప్రేమలో ఉన్న తర్వాత.. వీరు ఈ ఏడాది జనవరి 23న వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.