Oppo K14 5G price in India: ప్రముఖ మొబైల్ కంపెనీ OPPO ఇప్పటికే K14 అనే మొబైల్ లాంచ్ చేసి అందరి చేత మన్ననలు పొందుతోంది. ఈ ఫోన్ డిస్ప్లే వేరే లెవెల్ ఉండడంతో చాలామంది దీనిని ఆదరిస్తున్నారు. అయితే ఇప్పుడు K14 5G అనే మరో మొబైల్ మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. కొన్ని ఊహనాల ప్రకారం ఇది మార్చి మధ్యలో వస్తుందని తెలుస్తోంది. కానీ ఇప్పటికే దీని గురించి సమాచారం ఆన్లైన్లో ఉండడంతో చాలామంది దీని గురించి చర్చించుకుంటున్నారు. సాధారణంగా ఒప్పో కంపెనీ మొబైల్ కెమెరా ప్రత్యేకంగా ఉంటుందని చాలా మంది ఆశిస్తుంటారు. అందుకు అనుగుణంగానే ఈ కొత్త ఫోన్లో కూడా కెమెరాతో పాటు బ్యాటరీ వ్యవస్థ కూడా ప్రత్యేకంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇంతకీ ఈ ఫోన్ ఎలా ఉండబోతుంది అంటే?
చైనా కంపెనీకి చెందిన OPPO మార్చి 9 న K14 5G అనే మొబైల్ ను లాంచ్ చేనున్నట్టు అధికారికంగా తెలిపింది. ఆన్లైన్ సంస్థ ఫ్లిప్కార్ట్ ద్వారా విగ్రహాలు జరిపే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ఫోన్ తెలుపు లేదా ఉదా రంగులో ఉంటుందని చెబుతున్నారు. ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే.. ఇందులో 6.75 అంగుళాల HD + రిప్లై ఉండనుంది. పూర్తిగా LCD స్క్రీన్ కలిగిన ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. 1,125 nits బ్రైట్నెస్ తో ఉండే ఈ మొబైల్ లో 6300 చిప్ సెట్ అమర్చనున్నారు. 4gb రామ్ తో పాటు 128 జీబీ స్టోరేజ్ ఉండే ఇది రోజువారి వినియోగం దారులకు అనుగుణంగా పనిచేస్తుంది. అలాగే మల్టీ టాస్కింగ్ కోసం యూస్ చేసే వారు కూడా దీనిని కొనుగోలు చేయవచ్చు..
Also Read: OPPO నుంచి సంచలన మొబైల్.. ధర తెలిస్తే దిమ్మ తిరుగుతుంది..
Oppo కంపెనీ మొబైల్ అంటే కెమెరా గురించి ప్రత్యేకంగా చెబుతారు. అందుకు అనుగుణంగానే త్వరలో రాబోయే k 14 5G మొబైల్ లో 50 MP మెయిన్ కెమెరా ఉండనుంది. ఇదే సెల్ఫీ తో పాటు వీడియో కాలింగ్ కోసం కూడా పనిచేస్తుంది. డ్యూయల్ రియర్ కెమెరా సెట్ అప్ తో పాటు చదరపు ఆకారపు కెమెరా మా డ్యూయల్ ఉండనుంది. ఈ కెమెరా LCD ఫ్లాష్ లైట్ సెటప్ ను కలిగి ఉంటుంది. ఈ మొబైల్లో 7000 mAh బ్యాటరీ ఉండనుంది. ఈ బ్యాటరీ 45 W ఫాస్టెస్ట్ చార్జింగ్ తో సపోర్ట్ చేస్తుంది. బిజీగా ఉండేవారు తొందరగా చార్జింగ్ కావాలని అనుకునే వారికి ఈ చార్జింగ్ ఫుల్ ఫ్లెడ్జ్ గా అనుగుణంగా ఉంటుంది.
అలాగే ఈ మొబైల్ లో బ్రాండింగ్ ఫ్లాట్ రియర్ ప్యానెల్ తో పాటు హ్యాండ్ సెట్ కుడివైపు వంచబడినట్లు కనిపిస్తుంది అంచులు గుండ్రంగా కలిగి ఫ్రేమ్ ప్రీమియం లుక్ తో ఉంటుంది. దీనిని ఆన్లైన్లో రూ. 14,999 ధరతో విక్రయించనున్నారు. మిడిల్ రేంజ్ పీపుల్స్ ఆకర్షణీయమైన ఫీచర్లతో కలిగిన మొబైల్ కావాలంటే దీనిని ఎంపిక చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు.