Homeబిజినెస్One Plus 15T: ఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్.. One Plus నుంచి అద్భుతమైన...

One Plus 15T: ఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్.. One Plus నుంచి అద్భుతమైన మొబైల్.. ధర ఎంతంటే?

One Plus 15T: ప్రముఖ మొబైల్ కంపెనీ OnePlus ఎప్పటికప్పుడు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కొత్త గాడ్జెట్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఈ కంపెనీ నుంచి One Plus 13T సిరీస్ వచ్చింది. అయితే దీని కొనసాగింపుగా.. త్వరలో మార్కెట్లకి One Plus 15 T రాబోతుంది. దీని గురించి కొన్ని లీక్ లు ఆన్ లైన్ లోకి వచ్చాయి. వీటిని భట్టి చూస్తే నేటి తరానికి అనుగుణంగా ఈ మొబైల్ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందుల స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5చిప్ సెట్ ఉండనుంది. అలాగే అద్భుతమైన డిస్ ప్లే తో పాటు మెరుగైన బ్యాటరీ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ మొబైల్ ధర ఎలా ఉందో చూద్దాం..

One Plus నుంచి 15 T సిరీస్ అతి త్వరలోనే మార్కెట్లోకి రాబోతుంది. ఇందులో ప్రధానంగా డిస్ ప్లే గురించి చెప్పుకోవచ్చు. 6.32 అంగుళాల OLED డిస్ ప్లే ఉండి 165HZ రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. 1.5 K రిజల్యూషన్ ఉన్న ఈ డిస్ ప్లే తో మూవీస్ చూస్తే అద్భతమైన అనుభూతి కలుగుతుంది. అలాగే గేమింగ్ కోరుకునేవారికి ఇది అనుగుణంగా ఉంటుంది. ఇందులో 16 జీబి Ram, 1TB వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. దీంతో కావాల్సిన ఫొటోలతో పాటు వీడియోలు స్టోర్ చేసుకోవచ్చు.

Also Read: బడ్జెట్లోనే ఐఫోన్ 16,17.. క్రోమా ఎవ్రీథింగ్ సేల్ బిగ్ ఆఫర్..

సాధారణంగానే వన్ ప్లస్ మొబైల్స్ లో కెమెరా పనితీరు బెటర్ అని అంటూ ఉంటారు. అందుకు అనుగుణంగానే కొత్త మొబైల్ లో 50 MP మెయిన్ కెమెరా ఉండనుంది. దీనికి అనుగుణంగా అల్ట్రావైడ్ లెన్స్ కెమెరా కూడా పనిచేస్తుంది. సెల్ఫీ కెమెరా కూడా కావాల్సిన రిజల్యూషన్ కూడా అందిస్తుంది. ఇప్పడున్న పరిస్థితుల్లో బ్యాటరీ సామర్థ్యం కూడా చాలా అవసరం. వన్ ప్లస్ 15 టీ సిరీస్ లో 7,500 mAh బ్యాటరీ ఉండనుంది. ఇది 100 W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనుంది. అలాగే వైర్ లెస్ ఛార్జర్ కు కూడా మద్దతు ఇస్తుంది.

ఇక ఇందులో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 SoCపై పనిచేస్తుంది. ఇందులో 12 GB రామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఉన్న మొబైల్ రూ.39,000 నుంచి ప్రారంభం అవుతుంది. రోజూవారీ వినియోగదారులతో పాటు లగ్గరీ ఫీచర్స్ కలిగిన వారు ఈ మొబైల్ అనుగుణంగా ఉంటుందని అంటున్నారు. అయితే ఈ మొబైల్ మార్కెట్లోకి రావడానికి ముందే ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇప్పటి వరకు వచ్చిన 13 టీ కంటే 15 టీ పై ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టే అవకాశాలు ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular