Old House Demand : కరోనా తరువాత ప్రతి ఒక్కరి జీవితం పూర్తిగా మారిపోయింది. ఈ సమయం నుంచి ప్రతి ఒక్కరూ సొంతంగా ఇల్లు, వాహనం ఉండాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో చాలా మంది సొంత ఇల్లు నిర్మించుకోవడంతో పాటు అపార్టు మెంట్లలో ప్లాట్ కొనుగోలు చేస్తున్నారు. అయితే సరైన ఆదాయం లేనివారు పాత ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. 2018-19 సంవత్సరం కంటే 2024-25 సంవత్సరానికి 5 శాతం పెరిగినట్లు ఇంటిగ్రేటేడ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్లేస్ స్క్వేర్ యార్డ్స్ నివేదిక తెలిపింది. ఈ కాలంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందినా.. మరోవైపు కొత్త ఇళ్లతో పాటు పాత ఇళ్లను కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే కొత్త ఇళ్ల కంటే పాత ఇళ్లు ఎందుకు కొనుగోలు చేస్తున్నారంటే?
Also Read : హైదరాబాద్‌లో రియల్ జూమ్.. అద్దెలను మించిన ఇళ్ల ధరలు
2020 సంవత్సరం వరకు హైదరాబాద్ తో పాటు ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు అందుబాటులో ఉండేవి. కానీ కరోనా తరువాత పరిస్థితి మారిపోయింది. చాలా మంది సొంత ఇల్లు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు సొంతంగా ఇళ్లు నిర్మించుకోవడం కంటే.. రెడీమేడ్ గా ఉన్న ఇళ్లు కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపారు. అయితే కొత్తగా అపార్ట్ మెంట్ లో ఇళ్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపినా.. వాటి ధరలు అమాంతం పెరగాయి. దీంతో ఆదాయం తక్కువగా ఉన్న వారు సెకండ్ హ్యాండ్ ఇళ్ల కోసం ఆరా తీయడం మొదలు పెట్టారు. మరోవైపు చాలా మంది లగ్జరీ గృహాలను నిర్మించుకోవాలని అనుకోవడంతో మిడిల్ క్లాస్ పీపుల్స్ సెకండ్ హ్యాండ్ ఇళ్లను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు.
ఈ పరిస్థితి హైదరాబాద్ లో కూడా ఉంది. రిజిస్ట్రేషన్ ప్రకారం 2024-2025 ఏడాదిలో మొత్తం 71వేల యూనిట్లు రిజస్ట్రేషన్ అయ్యాయి. వీటిలో 35 వేలు కొత్త ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఉంటే.. 36 వేలు సెకండ్ హ్యాండ్ రిజిస్ట్రేషన్లుగా నమోదయ్యాయి. 2024-25 సంవత్సరంలో మొత్తంగా ప్రైమరీ యూనిట్లు 49 శాతంగా ఉంటే .. సెకండరీ యూనిట్ల శాతం 51 శాతంగా ఉంది. కొత్త ఇల్లు కంటే పాత ఇల్లు కొనుగోలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే వీటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కొత్త ఇళ్లు నిర్మించుకోవాలంటే అనువైన ప్రదేశం కావాలి. అంతేకాకుండా తాగునీరు, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా చూస్తున్నారు. అదే పాత ఇళ్లు సౌకర్యాలు ఉన్న ప్రాంతాల్లో కొనుగోలు చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నారు. ఈ క్రమంలో పాత ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది.
అయితే పాత ఇల్లు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు తెలుపుతున్నారు. రీసేల్ ప్రాపర్టీస్ లో ఎక్కువ శాతం మోసం జరుగుతూ ఉంటాయని అంటున్నారు. పాత ఇల్లు కొనుగోలు చేసే ముందు వాటర్ లీకేజ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అందువల్ల పాత ఇల్లును వర్షా కాలంలో కొనుగోలు చేయడం వల్ల ఎలాంటి సమస్యలు ఉన్నా తెలిసిపోతుంది. పాత ఇల్లు కొనుగోలు చేసే సమయంలో మధ్యవర్తులను నమ్మకుండా నేరుగా విక్రయదారుడిని నుంచి అసలు విషయాలు తెలుసుకోవాలి.