Saif Ali Khan : రామాయణం ఐకానిక్ సినిమాటిక్ సబ్జెక్టు. హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించే శ్రీరాముని గాథ పలు భాషల్లో దశాబ్దాలుగా తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ వంటి నటులు రాముని పాత్రతో ప్రేక్షకులకు అత్యంత దగ్గరయ్యారు. పదుల సంఖ్యలో నటులు రామునిగా నటించి మెప్పించారు. ఈ తరం హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ బాల్యంలో ఆ పాత్ర చేశాడు. అనంతరం ప్రభాస్ కి ఆ అవకాశం దక్కింది. ఆదిపురుష్ ప్రకటన ప్రభాస్ అభిమానుల్లో ఆసక్తి రేపింది. సినిమా వర్గాలతో పాటు ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూశారు.
Also Read : యంగ్ హీరోయిన్ తో రెండవ పెళ్ళికి సిద్దమైన హీరో సుమంత్!
అయితే టీజర్ విడుదలతో అందరి అంచనాలు తలకిందులు అయ్యాయి. మోడరన్ రామాయణ పేరుతో దర్శకుడు ఓమ్ రౌత్ ఆదిపురుష్ తెరకెక్కించిన తీరు విమర్శలపాలైంది. రాముడు, సీత, రావణుడు, హనుమంతుడు వంటి ప్రధాన పాత్రల లుక్స్ డిజైన్ చేసిన తీరు హిందువుల మనోభావాలు దెబ్బతీసింది. ముఖ్యంగా రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ లుక్, క్యారెక్టరైజేషన్ ని హిందువులు తీవ్రంగా వ్యతిరేకించాడు. రావణుడు ఈ చిత్రంలో తన వాహనానికి మాసం ఆహారంగా పెడతాడు. రావణుడు ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. ఆయన మాంసాహారం ముట్టడం ఏమిటనే ప్రశ్న లేవనెత్తారు.
నాసిరకం గ్రాఫిక్స్ తో పాటు రామాయణాన్ని వక్రీకరించి తీసిన ఓం రౌత్ తీవ్ర విమర్శలపాలయ్యాడు. ఆయన్ని ప్రభాస్ ఫ్యాన్స్ సైతం సోషల్ మీడియాలో ఏకిపారేశారు. అసలు ఆదిపురుష్ సినిమా విడుదల అడ్డుకుంటామని నార్త్ ఇండియాలో నిరసనలు వెల్లువెత్తాయి. ప్రభాస్ కెరీర్లో ఆదిపురుష్ చెత్త మూవీగా మిగిలిపోయింది.
తాజాగా సైఫ్ అలీ ఖాన్ ఆదిపురుష్ ని ఉద్దేశించి మాట్లాడాడు. తన 9 ఏళ్ల కుమారుడు తైమూర్ తో ఆదిపురుష్ కలిసి చూడగా, చేదు అనుభవం ఎదురైంది అన్నాడు. తైమూర్ తో కలిసి ఆదిపురుష్ చూస్తుండగా.. కాసేపటికి అతడు తండ్రి వైపు అసహనంగా చూశాడట. తైమూర్ కి కూడా ఆదిపురుష్ లో తన పాత్ర నచ్చలేదని అర్థం చేసుకున్న సైఫ్ అలీ ఖాన్.. సారీ అని చెప్పాడట. దానికి తైమూర్ పర్లేదు, అన్నాడట. ఆదిపురుష్ చేసినందుకు సైఫ్ అలీ ఖాన్ సైతం బాధగా ఫీల్ అవుతున్నాడని ఆయన కామెంట్స్ ని బట్టి తెలుస్తుంది.
సరైన అధ్యయనం, అవగాహన లేకుండా రామాయణం వంటి సబ్జెక్టుని తెరకెక్కించి ఓం రౌత్ అడ్డంగా బుక్ అయ్యాడు. ప్రస్తుతం డాక్టర్ అబ్దుల్ కలాం టైటిల్ తో ఓమ్ రౌత్ బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. మరి ఈ చిత్రాన్ని అయినా ఆయన ఎలాంటి వివాదాలు లేకుండా ప్రేక్షకులను మెప్పిస్తాడేమో చూడాలి.