Homeబిజినెస్NTPC Green Energy IPO: ఎన్టీపీసీ గ్రీన్ ఐపీఓ ఎప్పుడు ప్రారంభమవుతుంది..?

NTPC Green Energy IPO: ఎన్టీపీసీ గ్రీన్ ఐపీఓ ఎప్పుడు ప్రారంభమవుతుంది..?

NTPC Green Energy IPO: ఎన్టీపీసీ లిమిటెడ్ అనుబంధ సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ రూ. 10,000 కోట్ల ఐపీఓ త్వరలో ప్రైమరీ మార్కెట్లోకి రానుంది. ఇందుకు కంపెనీకి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నుంచి అవసరమైన అనుమతి లభించింది. ఈ ఐపీఓలో ఎలాంటి ఆఫర్ ఫర్ సేల్ ఉండదు. అంటే కంపెనీ ఐపీఓలో తాజా ఈక్విటీ షేర్ల ఇష్యూను తీసుకురానుందని, ఐపీఓలోని మొత్తం డబ్బు కంపెనీ ముందుకు తీసుకెళ్లేదుకు ఖర్చు చేస్తుందని తెలిపింది. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 2024, సెప్టెంబర్ 18న సెబీకి తన ఐపీఓ పత్రాలను సమర్పించింది. దీని ఐపీవోలో అర్హులైన ఉద్యోగులకు కోటా కూడా ఉందని స్పష్టం చేసింది. వారికి డిస్కౌంట్ పై షేర్లు కూడా లభిస్తాయి. ఈ ఐపీఓలో వాటాదారుల కోటా కూడా ఉంటుంది. అంటే ఆర్‌హెచ్‌పీ తేదీ వరకు మాతృ సంస్థ ఎన్టీపీసీ షేర్లను కలిగి ఉన్నవారు ఐపీఓలో వాటాదారుల కోటా ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్టీపీసీలో వాటా కొనుగోలు చేసి షేర్ హోల్డర్ కోటా ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో ఐపీవో కేటాయించే అవకాశం పెరుగుతుంది.

ఐపీఓ ఎప్పుడు ఓపెన్ అవుతుంది..?
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఐపీఓకు సంబంధించి ఇప్పటి వరకు అధికారిక తేదీని ప్రకటించలేదు. అయితే, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఐపీఓ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఐపీఓ ధరను ఇంకా ప్రకటించలేదు. ప్రైస్ బ్యాండ్ సమాచారాన్ని ఐపీఓ సబ్ స్క్రిప్షన్ తేదీతో పాటు లేదంటే ఆ తర్వాత కొద్దిసేపటికే ఇవ్వవచ్చు.

నిపుణుల అభిప్రాయం ఏంటి..?
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓపై మార్కెట్ విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఎన్టీపీసీ షేర్లకు ‘బై’ రేటింగ్ కేటాయించింది. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఎన్జీఈఎల్) గురించి ఐసీఐసీఐ సెక్యూరిటీస్ మాట్లాడుతూ.. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ వాల్యుయేషన్ మెట్రిక్ బాగుందని తెలిసింది.
అదే సమయంలో ఎన్టీపీసీలో దీని టార్గెట్ ధర రూ. 495. థర్మల్ పవర్ దిగ్గజం ఎన్టీపీసీ తన వ్యాపారాన్ని విస్తరించడానికి, ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇతర ఇంధన వనరుల కోసం చూస్తున్న తరుణంలో ఈ ఐపీఓ వచ్చిందని వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీ డైరెక్టర్ క్రాంతి బాతిని తెలిపారు. సమీపకాలంలో గ్రీన్ ఎనర్జీపై ఎక్కువ దృష్టి ఉంటుంది. కాబట్టి పెట్టుబడిదారులు స్పష్టంగా డబ్బును ఇందులో పెట్టుబడి పెట్టేందుకు ఇష్టపడతారు.’

ఐపీఓ డబ్బు వినియోగం..
ఐపీవో ద్వారా వచ్చిన రూ. 7,500 కోట్లను ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (ఎన్ఆర్ఈఎల్)లో పెట్టుబడులు పెట్టేందుకు వినియోగించనున్నారు దీంతో అప్పు తగ్గుతుంది. సాధారణ కార్పొరేట్ కార్యకలాపాలకు కూడా డబ్బు వినియోగిస్తారు. జూన్ 30, 2024 నాటికి, ఎన్టీపీసీ గ్రీన్ ‘పోర్ట్ పోలియో’ 14,696 మెగావాట్లను కలిగి ఉంది. ఇందులో 2,925 మెగావాట్ల ఆపరేషనల్ ప్రాజెక్టులు, 11,771 మెగావాట్ల ప్రాజెక్టులను కాంట్రాక్ట్ చేసి అప్పగించారు.

దీనికి అదనంగా 10,975 మెగావాట్ల పైపులైన్ సామర్థ్యం, 25,671 మెగావాట్ల పోర్ట్ పోలియో ఉంది. ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్.. ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ లిమిటెడ్, నువామా వెల్త్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ ఈ ఇష్యూకు లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తుండగా, కేఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఈ ఆఫర్ కు రిజిస్ట్రార్ గా వ్యవహరిస్తుంది.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version