https://oktelugu.com/

Bandhavgarh Elephant Deaths: టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో పది ఏనుగుల మరణం.. అసలు ఏం జరిగింది..? వెలుగులోకి షాకింగ్ నిజాలు

బంధన్ గఢ్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో పది ఏనుగుల మరణంపై ఉన్నత స్థాయి అధికారిని సస్పెండ్ చేస్తూ ఎంపీ ప్రభుత్వం చర్యలు..

Written By:
  • Mahi
  • , Updated On : November 4, 2024 / 12:09 PM IST

    Bandhavgarh Elephant Deaths

    Follow us on

    Bandhavgarh Elephant Deaths: బాంధవ్ గఢ్ టైగర్ రిజర్వ్ లో 10 ఏనుగులు మృతి చెందడంపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన సమీక్షలో ఫీల్డ్ డైరెక్టర్ అత్యవసర సమయంలో విధుల్లో లేకపోవడమేనని, డిప్యూటీ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ తన విధులను కింది స్థాయి సిబ్బందికి అప్పగించడమేనని వెల్లడైంది. తర్వాత సీనియర్ వన్యప్రాణి అధికారులు సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఫెయిల్ అయ్యారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మధ్యప్రదేశ్ అటవీ శాఖ కార్యదర్శి అతుల్ కుమార్ మిశ్రా ఆదివారం (నవంబర్ 03) బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఫీల్డ్ డైరెక్టర్ గౌరవ్ చౌదరి, పన్పథా రేంజ్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, డిప్యూటీ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ ఫతే సింగ్ నినామాలను సస్పెండ్ చేస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి చౌదరి మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వైల్డ్ లైఫ్) చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ కు సమాచారం ఇచ్చినప్పటికీ సెలవులు ముగించుకొని తిరిగి విధుల్లో చేరడంలో విఫలమవడం, సీనియర్ అధికారుల ఆదేశాలను ధిక్కరించడం, అధికారిక విధులను విస్మరించడం ద్వారా అఖిల భారత సేవల (ప్రవర్తన) నిబంధనలు, 1968 లోని రూల్ 3ని ఉల్లంఘించారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సకాలంలో స్పందించకపోవడమేనని, తన అధికారిక విధులు నిర్వర్తించకుండానే ప్రొసీడింగ్స్ ను కింది స్థాయి ఉద్యోగులకు అప్పగించారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

    హార్డ్ వర్కర్ అయినందుకు తనను శిక్షించారని నినామా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సస్పెన్షన్ గురించి బాధపడడం లేదు, కానీ ఏనుగుల మరణాల గురించి బాధ ఉందన్నాడు. 70-80 గ్రామాలు ఉన్న మూడు మండలాలు నా పర్యవేక్షణలో ఉంటాయి. వారంతా కోడో (ఈ చిరు ధాన్యాలు తినే ఏనుగులు మరణించాయి) పండిస్తారు. సిబ్బంది అన్ని చోట్లా ఏనుగులను ట్రాక్ చేయగలరా..? వాటన్నింటినీ ట్రాక్ చేసే వనరులు మా వద్ద లేవు అన్నారు.

    నినామా మాట్లాడుతూ.. ‘ఏనుగులు రాత్రి సమయంలో అస్వస్థతకు గురై ఉంటాయి. నా స్టాఫ్ వేరే చోట బీట్ లో ఉన్నారు. ఏనుగులు కోడో పంటను తినగా సంబంధిత రైతులు కూడా ఇంట్లో లేరు. మాకు కూడా ఎలాంటి సమాచారం లేదు. ఏనుగులు అస్వస్థతకు గురై కనిపించడంతో పలు జిల్లాల నుంచి వైద్యులను, వన్యప్రాణి అధికారులను పిలిచాను. వారంతా రావడానికి చాలా గంటలు పట్టింది. ఎంత ప్రయత్నించినా ఒక్క ఏనుగును కూడా కాపాడలేకపోయాం.’ అన్నారు.

    మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఆదివారం మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలోకి పెద్ద మందలు రావడంతో వాటిని ఎదుర్కోవడం అధికారులకు కొత్త అనుభవం అని, రాష్ట్రంలోని తూర్పు భాగంలో పెద్ద మందల కదలికలపై ఫీల్డ్ డైరెక్టర్లతో సహా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇంత పెద్ద ఘటన జరిగినా ఫీల్డ్ డైరెక్టర్ స్పందించలేదు. ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద మందల కదలికలపై నిఘా పెట్టడంలో ఆయన నిర్లక్ష్యం వహించారు’ అని యాదవ్ అన్నారు.

    ఏనుగుల మరణానికి గల కారణాలపై యాదవ్ మాట్లాడుతూ.. ‘పంటలపై పురుగుమందుల వాడకంపై తమకు ఎలాంటి సమాచారం అందలేదు. ఏనుగులు ఎలా మరణించాయో పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే తెలుస్తుంది. రిపోర్టు రెండు, మూడు రోజుల్లో అందుతుంది. రాష్ట్రంలో ఏనుగుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపుడుతుంది. అందుకు తగ్గ ప్రణాళికలను రూపొందిస్తోంది. ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసే యోచనలో అటవీశాఖ ఉంది. ఏనుగుల సంఖ్య గణనీయంగా ఉన్న కేరళ, అస్సాం, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన నిపుణులు ఉత్తమ పద్ధతులపై స్థానిక అధికారులకు సలహాలు ఇచ్చే విధానాన్ని తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. మానవ-జంతు సంఘర్షణ సంఘటనలను తగ్గించడానికి హథీ మిత్ర కార్యక్రమాన్ని పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది.’ అన్నారు.

    కోడో మిల్లెట్స్ తిని ఏనుగులు మృతి చెందాయని ఊహాగానాలు రావడంతో ఏనుగులు పొలాల్లోకి రాకుండా పంటల చుట్టూ సోలార్ పవర్డ్ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని యాదవ్ తెలిపారు.

    మధ్య ప్రదేశ్ లోని బాంధవ్ గఢ్ టైగర్ రిజర్వ్ లో వారం రోజుల్లో 13 ఏనుగుల గుంపుకు చెందిన 10 అడవి ఏనుగులు మృతి చెందాయి. కోడో మిల్లెట్ కు సంబంధించిన మైకోటాక్సిన్ల వల్ల ఈ మరణాలు సంభవించి ఉండవచ్చని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వన్యప్రాణి) విజయ్ ఎన్ అంబడే ఒక ప్రకటనలో తెలిపారు.