Homeబిజినెస్Motorola Edge Premium Smartphone: AI తరహా కెమెరా కావాలని అనుకునే వారికి ఇదే బెస్ట్...

Motorola Edge Premium Smartphone: AI తరహా కెమెరా కావాలని అనుకునే వారికి ఇదే బెస్ట్ ఫోన్..

Motorola Edge Premium Smartphone: ప్రముఖ కంపెనీ Motorola మొబైల్స్ అంటే చాలామంది ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. దీని నుంచి ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన ఎన్నో మొబైల్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అయినా కూడా నేటి తరం వారికి ఉపయోగపడే విధంగా లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన మొబైల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వీటిలో కెమెరా తో పాటు మెరుగైన బ్యాటరీ ఉండడంతో చాలామంది మోటోరోలా మొబైల్స్ కోసం ఎగబడుతున్నారు. అయితే కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఓ మొబైల్ 50 MP మెయిన్ కెమెరా తో పాటు ఫాస్టెస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేసే బ్యాటరీ ఉండడంతో దీనిపై ఆసక్తి పెరిగింది. ఇంతకీ ఇందులో ఉన్న పూర్తి వివరాలు ఏమో ఇప్పుడు చూద్దాం..

Motorola కంపెనీ నుంచి లేటెస్ట్గా మార్కెట్లోకి Edge Premium Smartphone అందుబాటులో ఉంది. దీనిని రోజు వారి వినియోగదారుల కోసం అనుగుణంగా తయారు చేశారు. ముందుగా ఈ ఫోన్ డిస్ప్లే గురించి మాట్లాడితే అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉంది. ఈ మొబైల్లో 6.78 అంగుళాల OLED డిస్ప్లే కలిగి ఉంది. ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. 3000 నిట్స్ బ్రైట్ నెస్ తో పనిచేయడంతో వీడియోలు చూడడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే మూవీస్ కూడా ఇందులో చూస్తే కొత్త అనుభూతి కలుగుతుంది. ఈ మొబైల్లో ఫ్లాగ్ షిప్ చిప్ సెట్ ను అమాచారు. ఇది ఏఐ యాప్స్ కు కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో 12gb రామ్ 256 జీబీ స్టోరేజ్ ఉండడంతో ఉద్యోగులకు, వ్యాపారస్తులకు అనుకూలంగా కావాల్సిన ఫోటోలు వీడియోలు స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఈ మొబైల్లో ప్రధానంగా కెమెరా గురించి చెప్పుకోవచ్చు. ఇందులో 50 MP మెయిన్ కెమెరా ఉండనుంది. అలాగే 64 MP పెరిస్కోప్ కెమెరా కూడా పనిచేయనుంది. 50 MP అల్ట్రా వైట్ కెమెరాతో కావాల్సిన ఫోటోలను తీసుకోవచ్చు. సెల్ఫీ కోసం 50 MP కెమెరా పనిచేయనుంది. ఈ కెమెరా ఏఐ ఫోటోలను కూడా తీసుకునేందుకు అనుగుణంగా ఉంటుంది. అలాగే ఇందులో ఆండ్రాయిడ్ 15 సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయడంతో రోజువారి వినియోగదారులు తమకు కావాల్సిన యాప్స్ తో పాటు చిన్నచిన్న వర్క్స్ కూడా చేసుకునేందుకు అనుగుణంగా ఉంటుంది. ఈ మొబైల్లో 5100 mAh బ్యాటరీని అమర్చారు. ఇది 125 వైర్డ్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుండగా..50 W wireless చార్జింగ్ కు అనుమతిస్తుంది

ఇంటీరియర్ లో మాత్రమే కాకుండా మొబైల్ చుట్టూ అల్యూమినియం ఫ్రేమ్ తో పాటు ఐపి 68 ఉండడంతో దీనికి రక్షణగా ఉండనుంది. అలాగే ఇందులో స్టీరియో స్పీకర్స్, డాల్ఫి సౌండ్ వంటి ఫీచర్లు కూడా ఉండడంతో యూత్ కు బాగా ఉపయోగపడుతుంది. ఇది మార్కెట్లో ప్రస్తుతం రూ.29,999 ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఫ్లిప్కార్ట్ మార్కెట్లో ఇది అందుబాటులో ఉంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular