కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కొత్తగా టూ వీలర్ కొనుగోలు చేయాలని ఆలోచించే వాళ్లకు శుభవార్త చెప్పింది. ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేసేవాళ్లు కొంతకాలం ఆగి ఎలక్ట్రిక్ వెహికిల్ ను కొనుగోలు చేస్తే తక్కువ ధరకే ఎలక్ట్రిక్ వెహికిల్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలను ప్రోత్సహించాలని కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఎలక్ట్రిక్ టూవీలర్లపై ఇదివరకు సబ్సిడీ కేడబ్ల్యూహెచ్‌కు 10వేల రూపాయలుగా ఉండగా కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆ సబ్సిడీని ఏకంగా 15,000 రూపాయలకు పెంచడం గమనార్హం. ఐసీఈ వెహికల్స్‌తో పోలిస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ ధర ఎక్కువనే సంగతి తెలిసిందే. ఐసీఈ వెహికిల్స్ కంటే ఈ వెహికిల్స్ ధర ఏకంగా 20,000 రూపాయలు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఆ కారణం వల్ల కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీని భారీగా పెంచింది.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ ప్రకటించడం వల్ల ప్రభుత్వ లక్ష్యం సాకారం కావడంతో పాటు టూవీలర్ల వినియోగం భారీగా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని పెంచడం కొత్తగా టూవీలర్ కొనుగోలు చేయాలని అనుకునేవాళ్లు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.
దేశంలోని ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీ ఏథర్ కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఫేమ్ 2 సబ్సిడీ సవరణ తర్వాత 450 ఎక్స్ వెహికల్‌ను 14500 రూపాయలు తక్కువ ధరకే కొనవచ్చని తెలిపింది.