ఉత్తరప్రదేశ్ లో ఇటీవల నిర్మించిన కరోనా మాతా ఆలయాన్ని కూల్చివేశారు. భూ ఆక్రమణల ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. కరోనా మమమ్మారి బారిన పడకుండా అమ్మవారి రక్షణ కోసం ప్రయాగ్రాజ్ లోని జూహి షుకుల్ పూర్ గ్రామంలో ఈనెల 7న కరోనా మాతా ఆలయాన్ని నిర్మించారు. లోకేశ్ కుమార్ శ్రీవాస్తవ అనే వ్యక్తి నిధులు సేకరించారు. అయితే తన భూమిని ఆక్రమించేందుకు తనకు చెందిన స్థలంలో కరోనా మాతా గుడి కట్టినట్లు నగేశ్ కుమార్ శ్రీవాస్తవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరోపణల నేపథ్యంలో కరోనా మాతా గుడిని కొందరు కూల్చివేశారు. భూ వివాదమే కారణమని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.