జీఎస్టీ చెల్లించేవారికి మోదీ సర్కార్ శుభవార్త..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కరోనా వల్ల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వ్యాపారులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ నుంచి వ్యాపారాలు చేసేవాళ్ల కోసం ట్యాక్స్ రిఫంట్ డ్రైవ్‌ ను కేంద్రం ప్రారంభించడం గమనార్హం. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వ్యాపారులకు భారీగా మేలు జరగనుంది. కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ద్వారా వ్యాపారులు ఎదుర్కొంటున్న లిక్విడిటీ సమస్యలకు చెక్ […]

Written By: Navya, Updated On : May 17, 2021 9:03 pm
Follow us on

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కరోనా వల్ల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వ్యాపారులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ నుంచి వ్యాపారాలు చేసేవాళ్ల కోసం ట్యాక్స్ రిఫంట్ డ్రైవ్‌ ను కేంద్రం ప్రారంభించడం గమనార్హం. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వ్యాపారులకు భారీగా మేలు జరగనుంది.

కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ద్వారా వ్యాపారులు ఎదుర్కొంటున్న లిక్విడిటీ సమస్యలకు చెక్ పెట్టవచ్చని భావిస్తోంది. లాక్ డౌన్ వల్ల పలు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల వ్యాపారులకు ఊరట కలగనుంది. సీబీఐసీ ఇప్పటికే ఫీల్డ్ ఆఫీసర్లకు జీఎస్టీ రిఫండ్ కు సంబంధించిన ఆదేశాలను జారీ చేసిందని సమాచారం.

ఈ నెల 15వ తేదీన జీఎస్టీ రిఫండ్ చెల్లింపు డ్రైవ్‌ ప్రారంభం కాగా ఈ నెల 31వ తేదీ వరకు జీఎస్టీ రిఫండ్ చెల్లింపు డ్రైవ్‌ జరగనుంది. వ్యాపారులకు జీఎస్‌టీ రిఫండ్ వెంటనే క్రెడిట్ కానుండటంతో కరోనా కష్టకాలంలో వ్యాపారులకు కొంతమేర భారం తగ్గనుంది. పెండింగ్‌లో ఉన్న జీఎస్‌టీ రిఫండ్ క్లెయిమ్స్ అన్నీ ఈ నెల 31వ తేదీలోపు సెటిల్ కానున్నాయని తెలుస్తోంది.

జీఎస్‌టీ చట్టం ప్రకారం రిఫండ్ సెటిల్‌మెంట్‌కు 2 నెలల గడువు ఉంటుంది. అయితే మోదీ సర్కార్ మాత్రం వ్యాపారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేవలం నెల రోజుల్లోనే జీఎస్‌టీ రిఫండ్ క్లెయిమ్ అప్లికేషన్ ను సెటిల్‌మెంట్ చేయాలని ఆదేశించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.