https://oktelugu.com/

Milage Cars: తక్కువ ధర.. 25 కి.మీలకు మించి మైలేజ్.. ఈ కార్లకు ఫుల్ డిమాండ్

మారుతి సుజుకీ కంపెనీకి చెందిన మరో మోడల్ సెలెరియో. ఇది డ్యూయెల్ జెట్ ఇంజిన్ తో పనిచేస్తూ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. దీనిని రూ.6.33 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఇది 26.68 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : April 10, 2024 / 12:12 PM IST

    Alto K 10 Milage Car 1

    Follow us on

    Milage Cars: కారు కొనాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ చాలా మంది తమకు ప్రత్యేకంగా కొన్ని అవసరాల నిమిత్తం కార్లను కొనుగోలు చేస్తారు. కొందరు ఫీచర్స్ బాగుండాలని కోరుకుంటే.. మరికొందరు ధర తక్కువగా ఉండాలని అనుకుంటారు. ఇంకొందరు ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారు కోసం సెర్చ్ చేస్తుంటారు. వినియోగదారుల అవసరాలు దృష్టిలో ఉంచుకొని కంపెనీలు సైతం వివిధ మోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తాయి. అయితే 25 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చే కొన్ని కార్లు అందుబాటులో ఉన్నాయి. వీటి గురించి వివరాల్లోకి వెళితే..

    సాధారణంగా కారుల మైలేజ్ 16 కిలోమీటర్ల నుంచి ప్రారంభం అవుతుంది. ఆయా కార్ల ఇంజిన్ బట్టి 20 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంటాయి. సీఎన్ జీ వేరియంట్ లో 35 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే కార్లు ఉన్నాయి. కానీ పెట్రోల్ తో నడిచే కారు 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఇచ్చే కార్లు ఉన్నాయని చాలా మందికి తెలియదు. కొన్ని ప్రముఖ కంపెనీలు సైతం ఈ కార్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచారు. ఆ కార్లు ఏవంటే?

    మారుతి కార్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయి సక్సెస్ అయిన మోడళ్లలో వ్యాగన్ ఆర్ ఒకటి. అత్యధికంగా విక్రయాలు జరుపుకున్న ఈ కారు 1.0 లీటర్ కె సిరీస్ నేచురల్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. దీనిని రూ.5.54 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఈ కారు లీటర్ పెట్రోల్ కు 25 .19 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇదే కంపెనీకి చెందిన గ్రాండ్ విటారా ఎస్ యూవీ బెస్ట్ మోడల్ గా పేరు తెచ్చుకుంది. ఆకట్టుకునే ఫీచర్లతో ఉన్న ఈ కారు రూ.18.43 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఇది 27.97 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

    టయోటా కంపెనీకి చెందిన అర్బన్ క్రూయిజర్ వినియోగదారులను ఇంప్రెస్ చేస్తుంది. హైబ్రిడ్ మారుతి గ్రాండ్ విటారా ప్లాట్ ఫాం పై ఉత్పత్తి అయినా క్రూయిజర్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. దీనిని రూ.16.66 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఇది 27.97 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. హోండా సిటీ కార్లా బాగా ఫేమస్. ఇందులో e-HEV మోడల్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. దీనిని 20.55 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. దీని మైలేజ్ 27.13 కిలోమీటర్లు.

    మారుతి సుజుకీ కంపెనీకి చెందిన మరో మోడల్ సెలెరియో. ఇది డ్యూయెల్ జెట్ ఇంజిన్ తో పనిచేస్తూ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. దీనిని రూ.6.33 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఇది 26.68 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇది ధర తక్కువైనా మైలేజ్ ఎక్కువ ఇచ్చే కారుగా ప్రసిద్ధి చెందింది.