MG Windsor EV: ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత భారత్లో అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. చాలామంది పాత కార్ల స్థానంలో విద్యుత్కాలను కొనుగోలు చేస్తున్నారు. అయితే కొన్ని కంపెనీలు విద్యుత్ కార్లను విపరీతంగా ఉత్పత్తి చేసి మార్కెట్లోకి తీసుకురావడంతో పోటీ పెరిగింది. కానీ కొన్ని కాళ్లు మాత్రమే ఆకర్షణీయంగా మారుతున్నాయి. వీటిలో ఎంజి మోటార్స్ కూడా ఉండడం విశేషం. సాధారణంగా ఎంజి మోటార్స్ కు చెందిన కొన్ని కార్లు మాత్రమే వినియోగదారులు కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. కానీ ఎలక్ట్రిక్ వేరియంట్ లో వచ్చిన ఓ కారును కొనేందుకు ముందుకు వస్తున్నారు. ఇందులో ప్రయాణిస్తే అచ్చం ఏరోప్లేన్ లో వెళ్లినట్టు అనుభూతి కలుగుతుందని కొందరు చెబుతున్నారు. ఇంతకీ అదేం కారు? దాని ఫీచర్స్ ఎలా ఉన్నాయి?
Also Read: శ్రీతేజ్ ని పరామర్శించిన అల్లు అరవింద్..వైరల్ అవుతున్న వీడియో!
MG MOTORS కంపెనీకి చెందిన మూడు కార్లు భారత్ లో ఎక్కువగా ఆదరణ పొందాయి. వీటిలో విండ్ సర్ EV ఇప్పటికే అత్యధిక సేల్స్ లో రాణించి విజయాన్ని నమోదు చేసుకుంది. వరుసగా అయిదు నెలలపాటు అత్యధిక అమ్మకాలు జరుపుకున్న ఈ కారు ఆరోనెలలోను అదే దూకుడుగా ముందుకు వెళ్ళింది. అయితే ఈ కారును ఇప్పుడు సరికొత్త గా అందించనున్నారు. దీనికి MG విండ్ సర్ EV Pro గా నామకరణం చేశారు. ఈ సరికొత్త కారులో కొత్త బ్యాటరీ ప్యాక్, అదనపు ఫీచర్లను చేర్చారు. డిజైన్ పాత కారు వలె ఉన్నప్పటికీ స్టైలింగులో కొద్ది మార్పులు చేశారు.
ఇందులో ఫీచర్లు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. వెహికల్ టు లోడ్ చార్జింగ్ సిస్టం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇది ఒక జనరేటర్ గా పనిచేస్తుంది. అంటే చిన్న పరికరాలు మాత్రమే కాకుండా పెద్దవాటికి కూడా చార్జింగ్ను అందిస్తుంది. ఇన్నర్ లో అడ్జస్ట్ చేయగల ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే టూ అడాస్ వంటి ప్రత్యేకతలు ఇందులో చేర్చారు. ఈ కారులో 15.6 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ను అమర్చారు. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, వైర్లెస్ చార్జింగ్, ఫిక్స్డ్ గ్లాస్ రూప్ వంటివి చేర్చారు. ఎంటర్టైన్మెంట్ కోసం నైన్ స్పీకర్స్ ఆడియో సిస్టం ఇందులో ఉంది. ఎంజి మోటార్స్ విండ్ సర్ EV లో 50.6 కిలో వాట్స్ బ్యాటరీ బ్యాక్ ఉంది. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 460 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఇది ఇండోనేషియాలో క్లౌడ్ ఇవి పేరుతో విక్రయిస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న విండ్ సర్ కారులో 38 కిలో వాట్స్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది 332 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అయితే పాత బ్యాటరీ తో పాటు కొత్త బ్యాటరీ కూడా 134 బిహెచ్పి పవర్, 200ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. విమానంలో వెళ్లే అనుభూతిని పొందే ఈ కారు ప్రస్తుతం మార్కెట్లో 10 లక్షల ప్రారంభ ధర నుంచి 12 లక్షల వరకు విక్రయిస్తున్నారు. అయితే బ్యాటరీని మార్చుకోవాలని అనుకుంటే 14 లక్షల నుంచి 16 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: బాలీవుడ్ లో మీనాక్షి చౌదరి కి బంపర్ ఆఫర్స్..వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ లో హీరోయిన్!