Nani : అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టిన నాని తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు. కెరియర్ మొదట్లోనే అష్టాచమ్మా (Ashta chamma) సినిమాతో ఒక మంచి సక్సెస్ ని సాధించిన ఆయన అప్పటినుంచి ఇప్పటివరకు వెనుతిరిగి చూడకుండా ముందుకు సాగుతూనే ఉన్నాడు… ప్రస్తుతం ఆయన హిట్ 3 (Hit 3) సినిమాతో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అతనికి మంచి గుర్తింపును తీసుకురావడమే కాకుండా మాస్ హీరోగా కూడా తనను మార్చిందనే చెప్పాలి. వైలెన్స్ ఎక్కువగా ఉండటంతో ఈ సినిమాని చూసిన ప్రతి ప్రేక్షకుడు నాని లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ ఆశ్చర్యపోయాడు. ఇక దాన్ని కూడా ఆయన చాలా సక్సెస్ ఫుల్ గా పోషించాడు అంటూ అతన్ని పొగుడుతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత రాబోయే ప్యారడైజ్ సినిమాతో ఫుల్ లెంత్ మాస్ క్యారెక్టర్ ని పోషించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి సంపాదించి పెట్టుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను క్రియేట్ చేసుకుంటున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట చేయబోతున్న సినిమాలతో ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు.
Also Read: ‘హిట్ 3’ గురించి రామ్ చరణ్ సెన్సేషనల్ కామెంట్స్..హీరో నాని కౌంటర్ వైరల్!
తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక నాని తన కెరీర్ మొదట్లోనే అష్ట చమ్మ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ సినిమాలో రాంబాబు గా ఉన్న తన పేరుని మహేష్ బాబు గా మార్చుకుంటాడు.
హీరోయిన్ స్వాతి కి మహేష్ బాబు అంటే చాలా ఇష్టం ఉండటంతో తన పేరుని మహేష్ బాబు అని చెబుతూ ఉంటాడు. అందువల్ల నిజ జీవితంలో కూడా నాని తన పేరుని మార్చుకుంటాడు అంటు కొంతమంది కొన్ని అభిప్రాయాలు అయితే వ్యక్తం చేశారు. కానీ నాని మాత్రం తన పేరుని మార్చుకోనని కరాకండిగా చెప్పాడు.
ఇక అప్పట్లో మహేష్ బాబు (Mahesh Babu) అభిమానులు సైతం తన పేరును మహేష్ బాబు గా మార్చుకుంటే బాగుంటుందని అభిప్రాయాలను వ్యక్తం చేసినప్పటికి నాని మాత్రం దానికి ఇష్టపడలేదు. మరి ఏది ఏమైనా కూడా ఒకప్పుడు మహేష్ బాబు పేరును వాడుకొని సూపర్ సక్సెస్ ను సాధించిన ఆయన ఇప్పుడు సోలోగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ముందుకు దూసుకెళ్తుండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.
Also Read : ఆ విషయంలో రాజమౌళికి పోటీ ఇస్తున్న నాని, ఇది కదా హీరోకి కావాల్సింది!