Homeబిజినెస్MG Windsor EV: ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ లో సరికొత్త రికార్డ్.. ఏకంగా 75 వేల...

MG Windsor EV: ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ లో సరికొత్త రికార్డ్.. ఏకంగా 75 వేల సేల్స్.. ఈ కారులో అంతగా ఏముంది..

MG Windsor EV: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుండడంతో కొన్ని కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునే వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇందులో భాగంగా MG మోటార్ సంస్థ MG Windsor EVని మార్కెట్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇది మార్కెట్లోకి వచ్చిన కేవలం రెండు సంవత్సరాల లోపే అత్యధిక సేల్స్ ను నమోదు చేసుకుంది. ఇంతకీ ఈ కారులో ఏముంది? దీనిని ఎందుకు ఎగబడి కొంటున్నారు?

MG Windsor EV అత్యధిక సేల్స్ నమోదు కావడానికి ప్రధాన కారణం ఇందులో ఉండే బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) విధానం. సాధారణంగా ఎలక్ట్రిక్ కార్ల ధరలు పెరగడానికి వాటిలో వాడే బ్యాటరీ కాస్ట్ కారణం అవుతుంది. అయితే MG సంస్థ కారు ధరను, బ్యాటరీ ధరను వేరు చేసింది. బ్యాటరీ లేకుండా కారును కేవలం ₹9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకే అందిస్తూ, బ్యాటరీ వినియోగానికి కిలోమీటరుకు ₹3.9 చొప్పున అద్దె కట్టేలా సరికొత్త ఆప్షన్ ఇచ్చింది. ఈ వ్యూహం భారతీయ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంది. ఒకవేళ బ్యాటరీతో కలిపి కారును పూర్తిగా సొంతం చేసుకోవాలనుకునే వారి కోసం ₹14.70 లక్షల నుండి ₹19 లక్షల ధరల్లో వేరియంట్లను అందుబాటులో ఉంచింది.

విండ్సర్ ఈవీ లో సౌకర్యాలు, ఫీచర్లు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇందులో ప్రయాణం చేస్తే విలాసవంతమైన అనుభూతిని ఇస్తుంది. దీనిలోని ‘ఏరో లాంజ్’ వెనుక సీట్లను ఏకంగా 135 డిగ్రీల వరకు వెనక్కి వాల్చుకోవచ్చు . దీనివల్ల విమానాల్లోని బిజినెస్ క్లాస్‌ తరహా కంఫర్ట్ లభిస్తుంది. అంతేకాకుండా డ్యాష్‌బోర్డ్‌పై అమర్చిన భారీ 15.6 అంగుళాల గ్రాండ్‌వ్యూ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, గ్లాస్ రూఫ్ మరియు అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఫ్యామిలీ కొనుగోలుదారులను ఎంతగానో ఆకర్షించాయి.

ఈ కారులో రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో ఒకటి స్టాండర్డ్ వేరియంట్. ఇది 38 kWh బ్యాటరీ ప్యాక్. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 332 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. సిటీ రైడింగ్‌కు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. రెండోది ప్రో వేరియంట్. 52.9 kWh బ్యాటరీ ప్యాక్ ఉండగా.. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 449 కిలోమీటర్ల లాంగ్ రేంజ్ అందిస్తుంది. హైవే ప్రయాణాలకు ఇది అనుకూలం. రెండు వేరియంట్లలోనూ 136 hp పవర్ మరియు 200 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు.

ఈవీలు అనగానే కేవలం హైదరాబాద్, ముంబై, ఢిల్లీ లాంటి పెద్ద నగరాలకే పరిమితం అనుకునే అంచనాలను విండ్సర్ ఈవీ తిరగరాసింది. ఎందుకంటే ఈ కారు మొత్తం అమ్మకాలలో దాదాపు 70 శాతం సేల్స్ నాన్ మెట్రో నగరాలు, టౌన్లు, ఎమర్జింగ్ మార్కెట్ల నుంచే ఉన్నాయి. ఈ ఏడాది జనవరి జూన్ మధ్య 19,000 పైగా విండ్సర్ కార్లు అమ్ముడయ్యాయి. అంతేకాకుండా మార్కెట్లోకి వచ్చిన కేవలం రెండు సంవత్సరాల లోపే 75,000 యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటేసింది. ఈ భారీ డిమాండ్ కారణంగా JSW MG మోటార్ ఇండియా కంపెనీ ఓవరాల్ సేల్స్ కూడా 13% వృద్ధిని సాధించాయి. ఈ విధంగా కేవలం నంబర్ల పరంగానే కాకుండా, భారత్‌లో ఈవీ కారును కొనుగోలు చేసే విధానాన్ని, చూసే కోణాన్ని మార్చడంలో ఎమ్‌జీ విండ్సర్ ఈవీ ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular