Meta : ప్రస్తుత డిజిటల్ యుగంలో, పిల్లలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే, దీని వల్ల వారు అనేక ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, పిల్లల ఆన్‌లైన్ భద్రతను దృష్టిలో ఉంచుకుని మెటా సరికొత్త ఫీచర్‌ను విడుదల చేయనుంది. టీనేజ్ ఖాతాగా పిలువబడే ఈ ఫీచర్ 16 ఏళ్ల లోపు పిల్లలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.
Also Read : ఇన్ స్టా లో మీ పిల్లలు ఏం చేస్తున్నారో మీరు చూడొచ్చు.. మెటా కొత్తగా చేస్తున్న ప్రయోగం ఏంటంటే..
టీనేజ్ ఖాతా ఫీచర్ అంటే ఏమిటి?
ఈ ఫీచర్ ముఖ్యంగా టీనేజర్ల కోసమే రూపొందించబడింది. ఇది 16 ఏళ్ల లోపు పిల్లలకు ఉద్దేశించినది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో టీనేజర్ల అనుభవాన్ని సురక్షితంగా, మెరుగ్గా మార్చడం దీని లక్ష్యం. టీనేజర్ల కార్యకలాపాలు, కంటెంట్‌ను దృష్టిలో ఉంచుకుని వారి సేఫ్టీని కఠినతరం చేస్తుంది.
ప్రైవసీ సెట్టింగ్‌లు:
టీనేజర్ల ఖాతాల ప్రైవసీని మెరుగుపరుస్తుంది.పిల్లల డేటా, కార్యకలాపాలను అపరిచితుల నుంచి రక్షిస్తుంది. టీనేజర్లు వారి వయస్సుకి తగిన కంటెంట్‌ను మాత్రమే చూడగలుగుతారు.
అపరిచితులతో సంబంధాలు పెట్టుకోకుండా చేస్తుంది.
మెటా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది?
కిడ్స్ ఆన్‌లైన్ సేఫ్టీ యాక్ట్ (KOSA) వంటి చట్టాలను తీసుకురావడానికి అమెరికన్ చట్టసభ సభ్యులు కృషి చేస్తున్న సమయంలో మెటా ఈ నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా ప్రభావం నుండి పిల్లలను రక్షించడం దీని ఉద్దేశ్యం. సోషల్ మీడియా వ్యసనంపై మెటా, టిక్‌టాక్ (బైట్‌డాన్స్), యూట్యూబ్, గూగుల్ వంటి కంపెనీలపై వందలాది కేసులు నడుస్తున్నాయి. 2023లో కాలిఫోర్నియా, న్యూయార్క్ సహా అమెరికాలోని 33 రాష్ట్రాలు మెటాపై దావా వేశాయి. ఈ వేదికల వల్ల ఎదురయ్యే ఇబ్బందుల గురించి ప్రజలను హెచ్చరించడంలో విఫలమవుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.
ఎవరిపై దీని ప్రభావం ఉంటుంది?
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించే టీనేజర్లపై ఈ ఫీచర్ ఎక్కువగా ప్రభావం చూపుతుంది. తమ పిల్లల కార్యకలాపాలను పర్యవేక్షించడంలో తల్లిదండ్రులకు ఈ ఫీచర్ సహాయపడుతుంది. ఈ ఫీచర్ ద్వారా పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలను తల్లిదండ్రులు మరింత సులభంగా నియంత్రించవచ్చు. అలాగే, పిల్లలు ఆన్‌లైన్‌లో ఎటువంటి ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోకుండా రక్షించవచ్చు. ఈ ఫీచర్ పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
మెటా తీసుకున్న ఈ నిర్ణయం సోషల్ మీడియాలో పిల్లల భద్రతకు ఒక మైలురాయిగా చెప్పవచ్చు. ఈ ఫీచర్ ద్వారా పిల్లలు సురక్షితమైన ఆన్‌లైన్ ఎక్సీపిరియన్స్ పొందవచ్చు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
Also Read : ట్విట్టర్ బాటలోనే మెటా.. ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్ లో ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం?