Athiya Shetty : రాయల్ చాలెంజర్స్ బెంగుళూరుపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘనవిజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 164 రన్స్ టార్గెట్ ను ఢిల్లీ క్యాపిటల్స్ ఫినిష్ చేసింది. నాలుగు వికెట్లు కోల్పోయి ముగించేసింది… ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ అదరగొట్టాడు. 93 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మిగతా ఆటగాళ్లు విఫలమవుతున్నప్పటికీ.. అతడు మాత్రమే నిలబడ్డాడు. బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించాడు.. స్టబ్స్ కేఎల్ రాహుల్ కు తోడ్పాటు అందించాడు. అతడు కూడా 38 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 111 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేశారు. మొత్తంగా 17.5లలోనే బెంగళూరు విధించిన టార్గెట్ ను ఫినిష్ చేశారు.
Also Read : మరో మూడు నెలల్లో కేఎల్ రాహుల్ పెళ్లి.. ఆయన మనసు దోచిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?
ఆనందాన్ని పంచుకుంది
కేఎల్ రాహుల్ బెంగళూరులోని చిన్నస్వామి మైదానంలో 93 పరుగులు చేసి.. ఢిల్లీ జట్టును గెలిపించడంతో అతడి భార్య అతియా శెట్టి ఆనందానికి అవధులు లేవు. తన భర్త సాధించిన గొప్ప రికార్డును ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. చిన్నస్వామి గ్రౌండ్లో 93 రన్స్ కొట్టిన తర్వాత కేఎల్ రాహుల్ ఒక్కసారిగా తన అసలు రూపాన్ని చూపించాడు. బ్యాట్ ను అమాంతం పైకి లేపి స్టేడియాన్ని గట్టిగా కొట్టాడు. అదే ఉత్సాహంతో ఢిల్లీ ప్రేక్షకులకు అభివాదం చేశాడు. అతడి వీరోచిత ఇన్నింగ్స్ చూసిన ఢిల్లీ ఆటగాళ్లు చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా కెప్టెన్ అక్షర్ పటేల్ అయితే పట్టరాని ఆనందాన్ని వ్యక్తం చేశాడు. చప్పట్లు కొట్టి కేఎల్ రాహుల్ ను మరింత అభినందించాడు. బ్యాట్ పైకి లేపి కె.ఎల్ రాహుల్ ప్రేక్షకులకు అభివాదం చేస్తున్న ఫోటోను స్టేసోషల్ మీడియాలో అతియా శెట్టి పోస్ట్ చేసింది. ” This Guy Ufff” అంటూ దానికి తనదైన వ్యాఖ్య యాడ్ చేసింది. ఒక రకంగా బెంగళూరు విధించిన 164 పరుగుల టార్గెట్ తన భర్త కె.ఎల్ రాహుల్ ఉఫ్ మని ఊదేశాడని అతియాశెట్టి పరోక్షంగా చెప్పింది. మొత్తంగా ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఆమె చేసిన పోస్టును ఢిల్లీ అభిమానులు సామాజిక మాధ్యమాలలో గింగిరాలు తెప్పిస్తున్నారు. కాగా, అతియా శెట్టి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తన భార్య ప్రసవం నేపథ్యంలో కేఎల్ రాహుల్ తొలి మ్యాచ్ కు దూరమయ్యాడు. ఆ తర్వాత జట్టులో చేరిపోయాడు.. గత సీజన్లో లక్నో జట్టుకు కెప్టెన్ గా ఉన్న రాహుల్.. ఈ సీజన్లో ఢిల్లీ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు.
Also Read : కేఎల్ రాహుల్ పెళ్ళికి ఎన్ని గిఫ్ట్ లు వచ్చాయో తెలిస్తే నోరు వెళ్ళ పెట్టాల్సిందే
