Meta Insta : సోషల్ మీడియాను పదేపదే చూడొద్దని తల్లిదండ్రులు చెబుతున్నప్పటికీ టీనేజ్ పిల్లలు మానుకోవడం లేదు. పైగా ఇంటర్నెట్లో రకరకాల సైట్లు పిల్లల ప్రవర్తన శైలిని మార్చేస్తున్నాయి. అందువల్లే తల్లిదండ్రులు అప్పుడప్పుడు పిల్లలపై ఒక కన్నేసి ఉంచుతారు.. అయినప్పటికీ పిల్లల ప్రవర్తన తీరుపై తల్లిదండ్రుల్లో ఆందోళన తగ్గడం లేదు. ఈక్రమంలో ప్రముఖ సోషల్ మీడియా సంస్థ మెటా సంచలన నిర్ణయం తీసుకుంది. 18 సంవత్సరాల లోపు పిల్లల కోసం ప్రత్యేకమైన ఆలోచన చేసింది. యువ ఖాతాల (టీన్ అకౌంట్స్)ను తెరపైకి తెచ్చింది.. పిల్లలకు ఇన్ స్టా ను అత్యంత సురక్షితంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని మెటా ప్రకటించింది. గత మంగళవారం నుంచి కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలలో అమలు చేసింది. ఈ విధానం ప్రకారం కొత్తగా ఇన్ స్టా లో చేరే 18 సంవత్సరాల లోపు యువతకు టీన్ అకౌంట్లు ఇస్తారు. ఒకవేళ ఇప్పటికే ఖాతాలు గనుక ఉంటే 60 రోజుల్లో వాటిని టీన్ అకౌంట్లుగా రూపాంతరం చెందిస్తారు.
ఏముంటుంది ఇందులో..
టీన్ అకౌంట్లో 18 సంవత్సరాల లోపు పిల్లలకు సంబంధించి భద్రత మెరుగ్గా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇందులో పేరంటం కంట్రోల్స్ ఉంటాయి.. ఈ ఖాతాలను మెటా కంపెనీ డిఫాల్ట్ గా ప్రైవేట్ విభాగంలో ఉంచింది. ఈ ఖాతాలో ఉన్నవారు ఇప్పటికే ఫాలో లేదా కనెక్ట్ అయిన ఖాతాల నుంచి మాత్రమే మెసేజ్ లు స్వీకరిస్తారు. వారిని మాత్రమే ట్యాగ్ చేయగలుగుతారు. సున్నితమైన కంటెంట్ పై పూర్తిస్థాయిలో నియంత్రణ ఉంటుంది. 16 సంవత్సరాలకు ఉన్న యూజర్లు డిఫాల్ట్ సెట్టింగ్స్ మార్చుకోలేరు. దీనికి వారి తల్లిదండ్రులు అనుమతించాల్సిందే. ఈ ప్రకారం పిల్లలు వాడే ఇన్ స్టా ఖాతాపై తల్లిదండ్రుల నిఘా ఉంటుందన్నమాట. ఇది మాత్రమే కాదు టీం అకౌంట్స్ మొత్తం డిఫాల్ట్ గా ప్రైవేట్ అకౌంట్ గా ఉంటాయి. ఒకవేళ కొత్తగా ఎవరైనా వారి ఖాతాలను అనుసరించాలంటే రిక్వెస్ట్ లను యాక్సెప్ట్ చేయాలి. లేకపోతే కంటెంట్ చూడడానికి అవకాశం ఉండదు. ఫాలో అయ్యే వ్యక్తులు కనెక్ట్ అయిన వ్యక్తుల నుంచి మాత్రమే మెసేజెస్ స్వీకరించగలరు. అన్నింటికంటే ముఖ్యంగా టీన్ ఖాతాలకు సెన్సిటివ్ కంటెంట్ కంట్రోల్ అనేది ప్రముఖంగా ఉంటుంది. చూపించే ఫీడ్ పై అసభ్య పదజాలాన్ని నిరోధిస్తుంది. కామెంట్లను, నేరుగా పంపించే సందేశాలను ఫిల్టర్ చేస్తుంది.. 60 నిమిషాల కంటే ఎక్కువ ఇన్ స్టా వాడితే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. రాత్రి పది నుంచి ఉదయం ఏడు వరకు స్లీప్ మోడ్ లోకి యాప్ వెళ్ళిపోతుంది. ఆ సమయంలో ఎలాంటి నోటిఫికేషన్లు రావు. పైగా నేరుగా పంపే సందేశాలకు ఆటో రిప్లయిస్ ను మెటా పంపిస్తుంది. పిల్లల సందేశాలను తల్లిదండ్రులు యాక్సిస్ చేసుకోవచ్చు. రోజువారి యూసేజ్ ను పరిశీలించవచ్చు..ఇన్ స్టా ను ఒక సమయం వరకే వాడేలా రూపొందించుకోవచ్చు. ఈ ఖాతాలను యూరోపియన్ యూనియన్లో ఈ ఏడాది చివరినాటికి మెటా అందుబాటులోకి తీసుకొస్తుంది. జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Metas new experiment is to see what your kids are doing on instagram
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com