Hyundai Exter vs Tata Punch : ఇండియాలో ప్రస్తుతం CNG, SUV కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. CNG కార్లు పెట్రోల్, డీజిల్ ఖర్చులను తగ్గిస్తాయి. అలాగే SUV కార్లు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి. దీంతో కార్ల తయారీ కంపెనీలు ఈ రెండింటి కాంబినేషన్ లో కార్లను లాంచ్ చేస్తున్నాయి. తక్కువ బడ్జెట్ లో హ్యుందాయ్ ఎక్స్ టర్, టాటా పంచ్ కార్లు CNG మోడల్ లో అందుబాటులో ఉన్నాయి.
Also Read : SUV వెర్షన్ లో అమ్మకాల రాజు.. నెలకు 7 వేలకు పైగా విక్రయం.. ఈ కారు గురించి తెలుసా?
ధరలో తేడా
హ్యుందాయ్ ఎక్స్ టర్ బేస్ CNG మోడల్ EX 1.2 CNG Duo MT ధర ఢిల్లీలో ఆన్ రోడ్ ప్రకారం 8.56 లక్షలు. టాటా పంచ్ బేస్ మోడల్ ప్యూర్ ధర ఢిల్లీలో ఆన్ రోడ్ ప్రకారం 8.29 లక్షలు. టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్ టర్ కంటే 27 వేలు తక్కువ.
ఇంజన్, మైలేజ్
హ్యుందాయ్ ఎక్స్ టర్ CNG, టాటా పంచ్ CNG కార్లు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో వస్తాయి. హ్యుందాయ్ ఎక్స్ టర్ CNG 4 సిలిండర్లతో, టాటా పంచ్ CNG 3 సిలిండర్లతో వస్తాయి. హ్యుందాయ్ ఎక్స్ టర్ CNG ఇంజన్ 68 bhp పవర్, 95.2 nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. టాటా పంచ్ CNG ఇంజన్ 72.4 bhp పవర్, 103 nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు కార్లు 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తాయి. టాటా పంచ్ CNG 26.99 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తే, హ్యుందాయ్ ఎక్స్ టర్ CNG 27.1 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
డిజైన్, ఫీచర్లు
హ్యుందాయ్ ఎక్స్ టర్, టాటా పంచ్ కార్లు హాలోజన్ హెడ్ లైట్స్ తో వస్తాయి. హ్యుందాయ్ ఎక్స్ టర్ లో LED టెయిల్ ల్యాంప్ లు ఉన్నాయి. ఈ రెండు కార్లలో ఫాబ్రిక్ అప్హోల్స్టరీ, ఫ్రంట్ పవర్ విండోస్, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. హ్యుందాయ్ ఎక్స్ టర్లో హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు ఉంది. ఈ రెండు కార్లలో సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మాన్యువల్ ఎయిర్ కండీషనర్ ఉన్నాయి. టాటా పంచ్ లో టిల్ట్ స్టీరింగ్, 90 డిగ్రీల డోర్ ఓపెనింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
సేఫ్టీ ఫీచర్లు
హ్యుందాయ్ ఎక్స్ టర్లో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. టాటా పంచ్ లో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి.టాటా పంచ్ లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) ఫీచర్ ఉంది. ఇది హ్యుందాయ్ ఎక్స్ టర్ లో లేదు. ఈ రెండు కార్లలో ABS తో EBD, రియర్ పార్కింగ్ సెన్సార్, 3-పాయింట్ సీట్ బెల్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
సైజులో తేడా
Hyundai Exter, Tata Punch కార్లు చూడటానికి ఒకేలా ఉంటాయి. Hyundai Exter, Tata Punch కంటే పొడవు, వెడల్పులో కొంచెం పెద్దది. హ్యుందాయ్ ఎక్స్ టర్ వీల్ బేస్ Tata Punch కంటే 5mm ఎక్కువ. ఈ రెండు కార్లలో డ్యూయల్ ట్యాంక్ సెటప్ ఉంది. ఈ కారణంగా బూట్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది.
Also Read : దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుపై ఊహించని డిస్కౌంట్